రోడ్లను హేమ మాలినీ బుగ్గల్లా నున్నగా చేస్తా..ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్

2024-11-05 09:36:21.0

రోడ్లను సినీ నటి హేమ మాలినీ బుగ్గల్లా నున్నగా చేస్తానంటూ ఆప్ పార్టీ ఎమ్మెల్యే నరేష్‌ బల్యాన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు

https://www.teluguglobal.com/h-upload/2024/11/05/1374961-app.webp

ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే నరేష్‌ బల్యాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రోడ్లను సినీ నటి హేమ మాలినీ బుగ్గల్లా నున్నగా చేస్తానంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘ఉత్తమ్‌ నగర్‌ ఉన్న రహదారులను హేమ మాలినీ బుగ్గల్లా సన్నగా చేస్తాను’ అంటూ ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి ప్రవీణ్‌ శంకర్‌ కపూర్‌ ఈ కామెంట్స్‌ను తీవ్రంగా ఖండించారు. ఆయన వ్యాఖ్యలు మహిళలను అగౌరవపరిచేలా, స్థానిక సమాజాన్నితల దించుకునే విధంగా ఉన్నాయన్నారు.

ఓ మహిళను అగౌరవపరిచేలా మాట్లాడిన ఎమ్మెల్యేపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆప్‌ సుప్రిమో అరవింద్‌ కేజ్రీవాల్‌ను డిమాండ్‌ చేశారు. మరోవైపు ఆప్‌ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాగా, రాజకీయ నేతలు హేమ మాలినీపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో మహారాష్ట్ర మంత్రి ఒకరు ఇలాంటి కామెంట్స్ చేశారు. జల్గావ్‌ జిల్లాలోని తన నియోజకవర్గంలో రోడ్లను ప్రముఖ నటి హేమ మాలినీ బుగ్గలతో పోల్చారు. ఆ రోడ్లను ఎంత బాగా అభివృద్ధి చేశానో విపక్ష నేతలు వచ్చి చూడాలని సవాల్‌ విసిరారు. అవి హేమ మాలినీ బుగ్గల్లా నున్నగా ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు.

MLA Naresh Balyan,Hema Malini,roads,Aam Aadmi Party,Arvind Kejriwal