రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ముగ్గురు ముఖ్యమంత్రులు

2025-01-22 12:03:07.0

దావోస్‌ లో సమావేశమైన రేవంత్‌, చంద్రబాబు, ఫడ్నవీస్‌

దావోస్‌లో జరుగుతోన్న వరల్డ్‌ ఎకనామిక్ ఫోరం సదస్సులో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు. తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాలు పంచుకున్నారు. రాష్ట్రాల అభివృద్ధి, సంక్షేమం, ఎకానమీ, ఇన్నోవేషన్‌, టెక్నాలజీ, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఆర్థిక స్థిరత్వం – ఎదురవుతున్న సవాళ్లు, ఉద్యోగాల కల్పనలో ఎలా ముందుకు వెళ్లాలి.. ఆయా రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం ఎలా ఉండాలి అనే అంశాలపై ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

Davos,World Economic Forum,Revanth Reddy,Chandrababu Naidu,Devendra Fudnavis,Round Table Meeting