2024-10-21 14:34:44.0
https://www.teluguglobal.com/h-upload/2024/10/21/1371202-lucky.webp
నా జీతం ఆరు వేల రూపాయలు అంటూ దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా వెంకీ అట్లూరి రూపొందించిన ‘లక్కీ భాస్కర్’ ట్రైలర్ విడుదల అయింది
దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘లక్కీ భాస్కర్’. ఈ నెల 31న ఫ్యాన్స్ ముందుకు రానుంది. తాజాగా చిత్ర యూనిట్ ట్రైలర్‌ను విడుదల చేశారు. నాపేరు భాస్కర్‌కుమార్..నాజీతం ఆరు వేలు అంటూ మొదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ట్రైలర్ చూస్తే మనిషి లైఫ్‌లో పైసాలు ప్రాధాన్యత ఎంతటిదో తెలియజేస్తుంది. ఆరు వేల శాలరీతో కుటుంబాన్ని పోషించే భాస్కర్ కోట్లకు ఎలా పడగలెత్తాడు అనే విషయాన్ని ఆస్తక్తిగా, ఉత్కంఠగా చూపించే ప్రయత్నం చేశారు. సినిమా కథను ట్రైలర్‌లో తెలియజేశారు.
కాలిగోటి నుంచి తల వరకు ఏమి కావాలో కొనుక్కో.. అంటూ దుల్కార్, మీనాక్షితో చెప్పే సంభాషణతో పాటు జూదంలో ఎంత గొప్పగా ఆడామో కాదో.. ఎక్కడ ఆపామో ముఖ్యం!… సిగరెట్, ఆల్కహాల్ కన్నా డబ్బు ఇచ్చే కిక్ ఎక్కువ లాంటి డైలాగులు ఈ ట్రైలర్‌లో ఆకట్టుకున్నాయి. సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ తెలుగులో నేరుగా నటిస్తున్న తొలి చిత్రమిది.
‘Lucky Bhaskar trailer,Dulquer Salmaan,Meenakshi Chaudhary,Venky Atluri,Nagavanshi,Sai Saujanya