‘లడ్డూ’లో కల్తీ జరిగిందని మేం నమ్ముతున్నాం

2024-10-04 13:10:52.0

కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ సంచలన వ్యాఖ్యలు

https://www.teluguglobal.com/h-upload/2024/10/04/1366137-srinivas-varma-central-minister.webp

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ జరిగిందని తాము నమ్ముతున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. లడ్డూ కల్తీపై సుప్రీం కోర్టు సీబీఐ నేతృత్వంలో స్వతంత్ర సిట్‌ ఏర్పాటు చేయడాన్ని తాము స్వాగతిస్తున్నామని తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పుపై శుక్రవారం ఆయన విజయవాడలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ స్పందించారు. గత ప్రభుత్వంలో హిందూ ఆలయాలపై దాడులు జరిగాయని, తిరుమలలోనూ నిబంధనలు తుంగలో తొక్కారని అన్నారు. జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌ లతో కూడిన ధర్మాసనం తిరుమల లడ్డూ పై దాఖలైన పిటిషన్లను విచారించి స్వతంత్ర సిట్‌ ఏర్పాటు చేసిందని, ఇది స్వాగతించే అంశమని తెలిపారు.