లారెన్స్‌ బిష్ణోయ్‌ సోదరుడి అరెస్ట్‌

https://www.teluguglobal.com/h-upload/2024/11/18/1378917-anmol-bishnoi.webp

2024-11-18 14:13:31.0

అమెరికాలో అరెస్ట్‌ చేసినట్టుగా ప్రచారం

ఎన్సీపీ ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీ హత్య కేసులో నిందితుడు లారెన్స్‌ బిష్ణోయ్‌ సోదరుడు అన్మోల్‌ బిష్ణోయ్‌ ని అమెరికాలోని కాలిఫోర్నియాలో అరెస్టు చేసినట్టుగా సమాచారం. లారెన్స్‌, అన్మోల్‌ సోదరులే తనకు సుపారీ ఇచ్చి బాబా సిద్ధిఖీని హత్య చేయించారని హత్యకు పాల్పడిన నిందితుడు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. కృష్ణ జింకలను వేటాడిన కేసులో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ ను అరెస్ట్‌ చేస్తామని బిష్ణోయ్‌ గ్యాంగ్‌ ఇప్పటికే బెదిరింపులకు దిగింది. ఈక్రమంలోనే బిష్ణోయ్‌ సోదరుల కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. అమెరికాలో అరెస్ట్‌ అయిన అన్మోల్‌ ను ఇండియాకు రప్పించేందుకు ముంబయి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 

Lawrence Bishnoi,Anmol Bishnoi,Baba Siddiqui,Salman Khan,Bishnoi Gang,America