2024-08-18 13:31:38.0
ఆ సమయంలో రవాణా సౌకర్యం లేకపోవడం వల్ల అటుగా వస్తున్న ఓ బైకర్‌ని లిఫ్ట్ అడిగింది. లిఫ్ట్ ఇస్తానని ఆమెను బైక్ ఎక్కించుకున్న బైకర్.. కొంత దూరం తీసుకెళ్లిన తరువాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
https://www.teluguglobal.com/h-upload/2024/08/18/1353151-young-woman-returning-from-party-raped-by-biker-who-gave-her-lift-in-bengaluru.webp
బెంగళూరులో ఓ యువతిపై అత్యాచారం జరిగింది. లిఫ్ట్ ఇస్తానని బైక్ ఎక్కించుకున్న వ్యక్తే ఆమెను అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి ఓ పార్టీకి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే..
డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న ఓ యువతి కోరమంగళలో స్నేహితులతో గెట్ టు గెదర్ ఈవెంట్‌కి వెళ్లింది. పార్టీ పూర్తి అయ్యేసరికి బాగా లేట్ అయ్యింది. అయినా సరే అక్కడి నుంచి హెబ్బగొడిలోని తన ఇంటికి బయల్దేరింది. కానీ, ఆ సమయంలో రవాణా సౌకర్యం లేకపోవడం వల్ల అటుగా వస్తున్న ఓ బైకర్‌ని లిఫ్ట్ అడిగింది. లిఫ్ట్ ఇస్తానని ఆమెను బైక్ ఎక్కించుకున్న బైకర్.. కొంత దూరం తీసుకెళ్లిన తరువాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెని అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు.
యువతి, ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తిపై నిఘా పెట్టిన పోలీస్ బృందాలు అన్ని చోట్లా తనిఖీలు చేపడుతున్నాయి. బాధితురాలి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఐదు బృందాలతో నిందితుడి కోసం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించామని, నేరానికి పాల్పడిన వ్యక్తిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని చెప్పారు.
Young Woman,Returning,Party,Raped,Biker,Lift,Bengaluru