లిఫ్ట్‌ వచ్చిందని అడుగుపెట్టి….

2025-03-11 06:15:52.0

మూడో అంతస్తు నుంచి గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న లిప్ట్‌పై ఆయన పడటంతో కమాండెంట్‌ గంగారాం మృతి

సిరిసిల్లలో ఓ భవనంలో లిఫ్ట్‌ ప్రమాదం జరిగింది.లిఫ్ట్‌ రాకముందే డోర్‌ తెరుచుకున్నది. దీంతో లిఫ్ట్‌ వచ్చిందనుకుని లోపలికి అడుగుపెట్టడంతో 17వ పోలీస్‌ బెటాలియన్‌ కమాండెంట్‌ గంగారాం కిందపడ్డారు. మూడో అంతస్తు నుంచి గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న లిప్ట్‌పై ఆయన పడటంతో తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించేలోపే గంగారం మృతి చెందారు. సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్‌ను కలిసి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నది. గంగారం స్వస్థలం నిజామాబాద్‌ జిల్లా కోటగిరి మండలం సిద్ధులం.

గంగారం మృతి పట్ల కేటీఆర్‌ సంతాపం

కమాండెంట్‌ గంగారం మృతి పట్ల బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సంతాపం ప్రకటించారు. పోలీస్‌ శాఖకు ఉన్నత సేవలు అందించిన గంగారం మృతి బాధకరం అన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు

Elevator arrived,Stepped,Commandant Gangaram,Passes away,KTR’s condolences