2023-09-12 01:58:51.0
డేనియల్ తుపాను ప్రభావంతో డెర్నా, జబల్ అల్ అఖ్తర్, అల్-మార్జ్ శివారు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయని లిబియా అధికార ప్రతినిధి మహమ్మద్ మసూద్ తెలిపారు.
తూర్పు లిబియాలో వరద బీభత్సం సృష్టించింది. మధ్యధరా సముద్ర ప్రాంతంలో తీవ్ర ప్రభావం చూపిన డేనియల్ తుపాను వల్ల ఇప్పటికే టర్కీ, బల్గేరియా, గ్రీస్ కుండపోత వర్షాలతో అతలాకుతలమయ్యాయి. తాజాగా లిబియాలో వరదల కారణంగా అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ వరదల కారణంగా సుమారు 150 మంది మృతిచెంది ఉంటారని ఆ దేశ అధికారులు సోమవారం తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని చెప్పారు.
డేనియల్ తుపాను ప్రభావంతో డెర్నా, జబల్ అల్ అఖ్తర్, అల్-మార్జ్ శివారు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయని లిబియా అధికార ప్రతినిధి మహమ్మద్ మసూద్ తెలిపారు. వరదల కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు భారీ నష్టం వాటిల్లిందని అక్కడి మీడియా సంస్థలు వెల్లడించాయి. వందలాది మంది లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకుపోయారని తెలిపాయి. మరోపక్క సైన్యం, సహాయక బృందాలు వారిని రక్షించడానికి తీవ్రంగా యత్నిస్తున్నాయి. రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొనడానికి వెళ్లిన తొమ్మిది మంది సైనికుల ఆచూకీ లభించలేదని మసూద్ చెప్పడం గమనార్హం.
Eastern Libya,Authorities,2000 Dead,Flood,Thousands missing