లులు ప్రతినిధులకు పూర్తిస్థాయి మద్దతు

2024-09-28 14:48:30.0

సీఎం చంద్రబాబుతో లులు గ్రూప్‌ ఛైర్మన్‌ భేటీ. రాష్ట్రంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో పెట్టుబడులపై చర్చ

https://www.teluguglobal.com/h-upload/2024/09/28/1364143-babu.webp

ఏపీ సీఎం చంద్రబాబుతో లులు గ్రూప్‌ ఛైర్మన్‌ యూసఫ్‌ అలీ భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో పెట్టుబడులపై చర్చించారు. విశాఖపట్నంలో మాల్‌, మల్టీప్లెక్స్‌, హైపర్‌ మార్కెట్‌ ఏర్పాటు, విజయవాడ, తిరుపతిలో మల్టీప్లెక్స్‌ నిర్మాణంపై చర్చించారు. లులు బృందంతో సానుకూల వాతావరణంలో చర్చలు జరిగినట్లు సీఎం చంద్రబాబు ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. లులు ప్రతినిధులకు పూర్తిస్థాయలో మద్దతు ఇస్తామని, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో పాల్గొనే భాగస్వాముల కోసం ఎదురు చూస్తున్నామని ఈ సందర్భంగా సీఎం చెప్పారు.