2022-12-18 06:18:55.0
https://www.teluguglobal.com/h-upload/2022/12/18/431732-kannadasan.webp
చిదంబరంలోని అన్నామలై విశ్వవిద్యాలయంలో ఓ కార్యక్రమానికి తమిళ కవి చక్రవర్తి కణ్ణదాసన్ వెళ్ళారు. వెళ్ళవలసిన సమయానికన్నా ఆలస్యంగా వెళ్ళారు.
ఆప్పుడు “లేట్ కణ్ణదాసన్ ….లేట్ కణ్ణదాసన్” అని గోల గోల చేశారు. ఆనందంతో చప్పట్లు కొట్టారు. ఈలలు వేశారు.
అదంతా చూస్తూ కణ్ణదాసన్ చిర్నవ్వుతో వేదికమీద కూర్చున్నారు.
ఆయన వంతు వచ్చింది మాట్లాడటానికి.
ఆయన తన ప్రసంగాన్నిలా మొదలుపెట్టారు…
“నేనెంతటి భాగ్యవంతుడినో నిజంగా…”
అందరూ ఆ మాట తర్వాత ఆయన ఏం చెబుతారాని నిరీక్షిస్తున్నారు ఆత్రుతతో.
వెంటనే కవి కణ్ణదాసన్ “నేనేం చెప్పబోతున్నానో తెలీలేదు కదూ….నేనిక్కడికి ఆలస్యంగా రావడంతోనే లేట్ కణ్ణదాసన్…లేట్ కణ్ణదాసన్ అని కేకలు పెట్టారు. లేట్ కణ్ణదాసన్ అనే మాటను నేను మరణించాక వినగలనా…ఈ విషయంలో నేను భాగ్యవంతుడినే కదా…ఇప్పుడే వినేసానా మాట” అనడంతోనే సభ చప్పట్లతో మార్మోగింది.
– యామిజాల జగదీశ్
Kannadasan,Telugu Kathalu