2025-02-13 09:33:33.0
విపక్షాల నిరసల మధ్యే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్శలా సీతరామన్ ఈ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టారు.
https://www.teluguglobal.com/h-upload/2025/02/13/1403027-minister-neerama.webp
లోక్ సభ ముందుకు ఎన్డీయే సర్కార్ ఆదాయపు పన్ను ఐటీ కొత్త బిల్లు తీసుకోచ్చింది. విపక్షాల నిరసల మధ్యే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్శలా సీతరామన్ ఈ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టారు. దీంతో విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. అనంతరం లోక్ సభ మార్చి 10 వరుకు వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. నిర్మలా సీతారామన్ దీనిని సభలో ప్రవేశపెట్టారు. ఇప్పటివరకు ఫైనాన్షియల్ ఇయర్, అసెస్ మెంట్ ఇయర్ అనేవి ఉండగా.. ఇక నుంచి ట్యాక్స్ ఇయర్ అనే కాన్సెప్ట్ మాత్రమే ఉండనుంది. ఈ కొత్త బిల్లు వచ్చే ఏడాది ఏప్రిల్ 01 నుంచి అమలులోకి రానుంది. అటు వచ్చే నెల 10వ తేదీ వరకు లోక్ సభను వాయిదా వేశారు. మరోవైపు వక్ఫ్ బిల్లు పై పార్లమెంటరీ సంయుక్త కమిటీ నివేదికకు రాజ్యసభలో ఆమోదం లభించింది. విపక్ష సభ్యుల నిరసన మధ్యే కేంద్రం ఆమోదం తెలిపింది. వక్ఫ్ చట్టంలో మార్పుల పరిశీలన కోసం కేపీఎస్ ఇటీవల సవరణ బిల్లు నివేదికను ఆమోదించింది. వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత జవాబు దారి తనాన్ని తీసుకురావడమే ఈ బిల్లు ఉద్దేశమని కేంద్రం చెబుతోంది.
కొత్త బిల్లులో ట్యాక్స్ ఇయర్ అనే పదాన్ని తీసుకొచ్చారు. టాక్స్ ఇయర్ అనేది నిర్దిష్ట ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను ప్రయోజనాల కోసం పరిగణించే 12 నెలల వ్యవధి. కొత్త ఆదాయపు పన్ను బిల్లు ప్రకారం ట్యాక్స్ ఇయర్ గతంలోలాగే ఏప్రిల్ 1న ప్రారంభమై మరుసటి ఏడాది మార్చి 31న ముగుస్తుంది. 1961 ఆదాయపు పన్ను చట్టంలో ఉపయోగించిన ‘ప్రివియస్ ఇయర్’, ‘అసెస్‌మెంట్ ఇయర్(మదింపు సంవత్సరం)’ స్థానంలో ఈ ట్యాక్స్ ఇయర్‌ను వాడనున్నారు. స్థిరమైన ట్యాక్స్ ఇయర్‌ను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా పన్ను చెల్లింపుదారులు ఆదాయాన్ని నివేదించడానికి, పన్నులు చెల్లించడానికి నిర్దిష్ట వ్యవధిని కలిగి ఉంటారు. ఇది విభిన్న ఆర్థిక సంవత్సరాలకు వేర్వేరు అసెస్‌మెంట్ ఇయర్(మదింపు సంవత్సరం-వచ్చే ఆర్థిక సంవత్సరం)లను కలిగి ఉండటం వల్ల తలెత్తే గందరగోళాన్ని తొలగిస్తుంది.
Lok Sabha,Finance Minister Nirsala Sitharaman,Income Tax IT New Bill,Speaker Om Birla,Congress party,Waqf Bill,Assessment Year,Wakf Act