వంగవీటి రాధాను పరామర్శించిన మంత్రి నారా లోకేశ్

2024-10-22 13:37:58.0

ఇటీవల అస్వస్థతకు గురై కోలుకుంటున్న మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణను ఏపీ మంత్రి నారా లోకేశ్ ఇవాళ పరామర్శించారు.

https://www.teluguglobal.com/h-upload/2024/10/22/1371529-nara.webp

మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణను ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ఇటీవల అస్వస్థతకు గురైన రాధా కోలుకుంటున్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని మంత్రి లోకేష్ విజయవాడకు చేరుకున్నారు. తాడేపల్లి మండలం ప్రాతూరులోని వంగవీటి రాధాకృష్ణ ఇంటికి వెళ్లి లోకేష్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని నారా లోకేష్ ఆకాంక్షించారు. ఈ క్రమంలో వంగవీటి రాధా ఫ్యామిలీతో ఆత్మీయంగా ముచ్చటించారు. మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తమ ఇంటికి వచ్చి పరామర్శించడం పట్ల వంగవీటి రాధా కృతజ్ఞతలు తెలిపారు.