2024-10-16 03:23:04.0
ఆహారం నాణ్యంగా లేదని నటుడు, డైరెక్టర్ పార్తిబన్ ‘ఎక్స్’ పోస్టు
https://www.teluguglobal.com/h-upload/2024/10/16/1369364-parthiban.webp
వందేభారత్‌లో తనకు వడ్డించిన ఆహారం నాణ్యంగా లేదని నటుడు, డైరెక్టర్ పార్తిబన్ ‘ఎక్స్’ పేజీలో పోస్టు పెట్టారు. చెన్నై సెంట్రల్ నుంచి కోయంబత్తూరుకు వెళ్లే వందేభారత్ రైలులో ఆయన ఈ నెల 13న ప్రయాణం చేశారు. ఫుడ్ సర్వర్ల సేవలు బాగున్నాయని, రాత్రి వడ్డించిన చికెన్ అధ్వాన్నంగా ఉందని పేర్కొన్నారు. ఆహారంలో నాణ్యత లేదని, ఇది ప్రయాణికులకు ఉపయోగపడదని కంప్లైంట్ బుక్‌లో కూడా రాసినట్లు తెలిపారు. పార్తిబన్ పోస్టుపై పలువురు నెటీజన్లు స్పందించారు. ప్రజలకు మంచి జరగాలంటే ఎవరైనా ముందుకు రావాలని, మీరు అద్భుతమైన పనిచేశారని కితాబు ఇచ్చారు. పార్తిబన్ పోస్టు చేసిన కొన్నిగంటల తర్వాత రాత్రి 7 గంటల సమయంలో సేలం రైల్వే డివిజన్‌లోని డివిజనల్ రైల్వే మేనేజర్ ఫిర్యాదుపై స్పందించారు. ఆయనకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు రైల్వే మేనేజ్‌మెంట్ తెలిపింది. ఫుడ్ సర్వీస్ లోపానికి సంబంధించి సంబంధిత ఫ్రాంచైజీపై చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నది.
Vande Bharat,Actor-director Parthiban,’Bad quality food’,Complains,DRM,expresses regret