2024-10-21 15:06:21.0
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఈ నెల 23న వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నిక కోసం నామినేషన్ దాఖలు చేయనున్నారు
https://www.teluguglobal.com/h-upload/2024/10/21/1371210-priyaka.webp
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఈ నెల 23న వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నిక కోసం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో ప్రియాంక గాంధీ ఇవాళ సమావేశమయ్యారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా కలెక్టర్ ఎదుట యూడీఎఫ్ అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేస్తారని పేర్కొన్నారు. దీనికి ముందు ఉదయం 11 గంటలకు కల్పేట కొత్త బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు రాహుల్ గాంధీతో కలిసి ప్రియాంక గాంధీ రోడ్‌షో నిర్వహిస్తారని తెలిపారు.
నామినేషన్ కార్యక్రమానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకులు కూడా ప్రియాంక గాంధీ నామినేషన్ కార్యక్రమానికి హాజరవుతారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. రాహుల్ గాంధీ రాజీనామా చేసిన కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నిక జరుగనున్నది.
Priyanka Gandhi,Wayanad by-election,Mallikarjuna Kharge,Sonia Gandhi,Rahul Gandhi