వయసు చూస్తే…? (మినీ కథ)

2022-12-04 14:54:26.0

https://www.teluguglobal.com/h-upload/2022/12/04/429566-age.webp

శ్రీలక్షి అమెరికా నుంచి వచ్చి మూడు నెలలు అయింది. మూడు రోజుల నుంచీ పన్ను నొప్పిగా ఉంటే దగ్గర లో ఉన్న డెంటిస్ట్ దగ్గరకు వెళ్లింది.

ఆ డాక్టర్ పేరు సత్యప్రసాద్. తను హైస్కూల్ లో చదువుతున్నప్పుడు ఇదే పేరుతో తన క్లాస్ లోనే ఒకతను ఉండేవాడు.

లోపలికి వెళ్లి చూస్తే బట్టతలతో కొంచెం వయసు మళ్ళిన వాడిలా కనిపించాడు. అయినా సందేహ నివృత్తి కోసం అడిగింది. “మీరు ఫలానా సంవత్సరం ఫలానా స్కూల్లో ఫలానా క్లాసు చదివారా “అని అడిగింది.

” మీకెలా తెలుసు?” అని అడిగాడు.

” మీరు నా క్లాస్ లో ఉండేవారు” అన్నదామె.

“అవునా? మీరు ఏ సబ్జక్ట్ చెప్పేవారు టీచర్ ?” అని ఆశ్చర్యంగా అడిగాడు డాక్టర్ సత్యప్రసాద్

**

(అదీ కథ ! తెలిసిందిగా ! ఇంతకీ విషయం ఏమిటంటే అతను వయసు మళ్ళిన వాడిలా ఆమెకు కనిపిస్తే, ఆమె అంతకన్నా వయసు మళ్ళిన దానిలా అతనికి కనిపించి ఆమె తన టీచర్ అని అతను అనుకున్నాడు.)

– శ్రీధర

Telugu Kathalu,Telugu Kavithalu,Telugu Poets