2024-10-15 09:52:06.0
మహారాష్ట్ర ప్రచార సభలో తేల్చిచెప్పిన శరద్ పవార్
https://www.teluguglobal.com/h-upload/2024/10/15/1369142-sharad-pawar.webp
తనకు వయసు లెక్క కాదని.. రాష్ట్రం కోసం శ్రమిస్తూనే ఉంటానని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ తేల్చిచెప్పారు. మాహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రచార సభలో శరద్ పవార్ ప్రసంగిస్తున్నప్పుడు కొందరు వ్యక్తులు ఆయన ఫొటోతో పాటు దాని కింద ఆయన వయసు 84 ఏళ్లు అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు. ఆ ప్లకార్డులు చూపించడంతో శరద్ పవార్ స్పందించారు. కొందరు యువకులు నిలబడి ప్లకార్డులు చూపించారు.. మీరేమి బాధ పడకండి.. మనది సుదీర్ఘ ప్రయాణం.. మహారాష్ట్రను సరైన మార్గంలో నడిపే వరకు నేను ఆగిపోను.. 84 ఏళ్లు మాత్రమే కాదు.. 90 ఏళ్లు వచ్చినా రాష్ట్రం కోసమే శ్రమిస్తాను.. అప్పటి వరకు విశ్రమించేది లేదు అని తేల్చిచెప్పారు. మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ)లో సీట్ల సర్దుబాటులో విభేదాలున్నాయని కొందరు ప్రచారం చేస్తున్నారని.. అలాంటి ఇబ్బందులేమి లేవన్నారు. బీజేపీ నేతృత్వంలో మహాయుతి సంకీర్ణ సర్కారును గద్దె దించే వరకు విశ్రమించేది లేదని పవర్ స్పష్టం చేశారు.
Sharad Pawar,Maharashtra,Assembly Elections,Age not factor,work for state,some one shows placards