వరంగల్‌లో‌ ఉగ్రవాదుల కలకలం

2025-01-29 09:54:23.0

వరంగల్‌లో ఉగ్రవాదులు కదలికలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

వరంగల్‌లో ఉగ్రవాదులు కదలికలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఓరుగల్లు నగరానికి చెందిన జక్రియా అనే వ్యక్తికి పాకిస్థాన్‌ టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయని పొలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొంతకాలంగా వరంగల్ శివనగర్‌ అండర్‌ బ్రిడ్జి వద్ద బిర్యానీ సెంటర్‌ నడుపుతున్న జక్రియా కొన్నేళ్లుగా పాక్‌ ఉగ్రవాదులతో జక్రియా సంబంధాలు కొనసాగిస్తున్నట్టు నిఘావర్గాలు గుర్తించాయి. వరంగల్ జానిపీరీలకు చెందిన జక్రియాకు పాకిస్తాన్ టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయని నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ మేరకు అతన్ని చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

ఈనెల 25న శ్రీలంకకు వెళ్తుండగా.. జక్రియాను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, కొంతకాలంగా వరంగల్ శివనగర్ అండర్ బ్రిడ్జ్ వద్ద నిందితుడు జక్రియా బిర్యానీ సెంటర్ నడుపుతున్నట్లు తెలుస్తోంది. అతనికి కొన్నేళ్లుగా పాకిస్తాన్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. 2013లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దిల్ సుఖ్ నగర్ లో ఉగ్రవాదులు రెండు చోట్ల బాంబు పేల్చారు. అప్పటికీ తెలంగాణ రాలేదు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత ఉగ్రవాదుల ఊసే లేదు. తెలంగాణలోకి ఉగ్రవాదులు ప్రవేశించాలని చూస్తే.. వారిని పోలీసులు అరెస్ట్ చేసే వారు. కానీ తాజాగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కాకుండా వరంగల్ లో ఉగ్రవాదుల కలకలం సృష్టించారు. 

Warangal,Terrorists,Zakaria,Pakistan is a terrorist,Warangal Shivanagar,Biryani Centre,Chennai Airport,CM Revanth reddy,Hyderabad,Congress Goverment,KCR,KTR,BRSParty