వరంగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.ఏడుగురు మృతి

https://www.teluguglobal.com/h-upload/2025/01/26/1397825-wgl.webp

2025-01-26 07:08:10.0

వరంగల్‌ మామునూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

వరంగల్‌-ఖమ్మం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మితిమీరిన వేగంతో ఉన్న లారీ అదుపు తప్పి ఆటోలపై పడిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో 6 గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇనుప స్తంభాల లోడుతో వెళుతున్న లారీ బోల్తా పడింది. ఈ సందర్భంగా రెండు ఆటోలపై లారీ పడిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు మృతిచెందారు.

ఈ ప్రమాదంలో డ్రైవర్‌ తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. మృతిచెందిన వారిలో ముగ్గురు మహిళలు, ఓ బాలుడు ఉన్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు. 

Khammam,National Highway,Road accident,Warangal,Mamunur,Crime news,Telangana police