వరద సహాయ నిధులు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

2024-10-14 18:43:24.0

వరద బాధితుల తరలింపునకు అవసరమైతే ఆర్టీసీ బస్సులను కిరాయికి తీసుకోవాలని అధికారులకు సూచన

https://www.teluguglobal.com/h-upload/2024/10/14/1368953-ap-symbol.webp

భారీ వర్షాల దృష్ట్యా ఏపీ ప్రభుత్వం వరద సహాయ నిధులను విడుదల చేసింది. ప్రకాశం, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య, వైఎస్‌ఆర్‌జిల్లాలకు రూ. కోటి చొప్పున నిధులు విడుదల చేసింది. రిలీఫ్‌ క్యాంపులు, తాగునీరు, ఆహారం, హెల్త్‌ క్యాంపులు, శానిటేషన్‌ కోసం అత్యవసర నిధులను ప్రభుత్వం కేటాయించింది. వరద బాధితుల తరలింపునకు అవసరమైతే ఆర్టీసీ బస్సులను కిరాయికి తీసుకోవాలని అధికారులకు సూచించింది. శాఖల సమన్వయంతో పడిపోయిన చెట్లను తొలిగించాలని ఆదేశించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.