వరల్డ్‌ చెస్‌ చాంపియన్‌గా గుకేశ్‌

https://www.teluguglobal.com/h-upload/2024/12/12/1385326-gukesh.webp

2024-12-12 13:41:23.0

డింగ్‌ లిరెన్‌తో పోరులో గెలిచిన భారత గ్రాండ్‌ మాస్టర్‌

 

ఇండియన్‌ గ్రాండ్‌ మాస్టర్‌ దొమ్మరాజు గుకేశ్‌ వరల్డ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ కైవసం చేసుకున్నారు. చైనాకు చెందిన డిఫెండింగ్‌ చాంపియన్‌ డింగ్‌ లిరెన్‌ పై విజయం సాధించి కొత్త చాంపియన్‌గా అవతరించాడు. గురువారం జరిగిన 14వ రౌండ్‌లో 18 ఏళ్ల గుకేశ్‌ డింగ్‌ లిరెన్‌తో హోరాహోరీ తలపడ్డాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి చాంపియన్‌షిప్‌ సాధించాడు. విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత వరల్డ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ సొంతం చేసుకున్న రెండో భారత గ్రాండ్‌ మాస్టర్‌గా గుకేశ్‌ చరిత్ర సృష్టించాడు.