2025-02-17 12:26:23.0
వరుసగా 8 సెషన్లుగా నష్టాలు చవిచూసిన సూచీలు.. ఎట్టేకేలకు స్వల్ప లాభాల్లో ముగిశాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. వరుసగా 8 సెషన్లుగా నష్టాలు చవిచూసిన సూచీలు.. ఎట్టేకేలకు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఉదయమంతా నష్టాల్లో కొనసాగిన సూచీలకు ఆఖర్లో కొనుగోళ్ల మద్దతు కలిసి వచ్చింది. ముఖ్యంగా బ్లూచిప్ స్టాక్స్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో కొనుగోళ్ల మద్దతు కనిపించింది. డాలరుతో రూపాయి మారకం విలువ 86.87గా ఉన్నది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 75.07 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 2907 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.
నెన్సెక్స్ ఉదయం 75,641.41 వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 75,294.76 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. ఆఖర్లో పుంజుకుని 57.65 పాయింట్ల లాభంతో 75996.86 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 30.25 పాయింట్ల లాభంతో 22,959.50 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫిన్ సర్వ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అదానీ పోర్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఎయిర్ టెల్, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.
Stock Market Close Highlights,Sensex snaps,8-day losing run,Gains 702pts from low,Nifty at 22,959