వర్షాకాలం విటమిన్–డి లోపం రాకూడదంటే..

https://www.teluguglobal.com/h-upload/2024/08/05/500x300_1349894-vitamin-d.webp
2024-08-05 12:40:51.0

విటమిన్–డి లోపం రాకుండా ఉండాలంటే తీసుకునే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇల్లు, ఆఫీసుల్లోనే ఎక్కువగా గడపడం బయట ఎండకు ఎక్స్‌పోజ్ అవ్వకపోవడం వల్ల ఈ రోజుల్లో చాలామందికి విటమిన్–డి లోపం తలెత్తుతుంది. అయితే వానాకాలంలో ఉండే మబ్బులు, తేమ వాతావరణం కారణంగా ఈ సీజన్‌లో ఈ సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. దీనికై ఎలాంటి కేర్ తీసుకోవాలంటే.

విటమిన్–డి లోపం రాకుండా ఉండాలంటే తీసుకునే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. డైట్‌లో కొన్ని పదార్థాలు తీసుకోవడం ద్వారా శరీరం ఎక్కువ ‘డి’ విటమిన్‌ను గ్రహించేలా చూసుకోవచ్చు.

వానాకాలం విటమిన్–డి కోసం పాలు, పెరుగు ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. వీటిలో నేరుగా విటమిన్–డి లభించకపోయినా శరీరం విటమిన్–డి ఎక్కువగా శోషించుకోడానికి ఇవి హెల్ప్ చేస్తాయి.

‘డి’ విటమిన్ ఎక్కువగా లభించే మరో ఆహారం చేపలు. సాల్మన్, ట్యూనా, సార్డినెస్ వంటి చేపల్లో ‘డి’ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. అలాగే వీటిలో క్యాల్షియం, ప్రొటీన్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి.

ఎండలో ఎక్కువగా పెరిగే పుట్టగొడుగుల ద్వారా కూడా విటమిన్–డి లభిస్తుంది. వీటిలో ‘డి’ విటమిన్‌తో పాటు ‘బీ’ కాంప్లెక్స్ విటమిన్లు, ఫైబర్, ప్రొటీన్స్, సెలెనియం వంటి పోషకాలు కూడా ఉంటాయి.

తృణధాన్యాలు, మిల్లెట్స్, చీజ్, ఓట్స్, సోయా గింజల ద్వారా కూడా విటమిన్–డి లభిస్తుంది. అలాగే గుడ్డు కూడా ‘డి’ విటమిన్‌కు మంచి సోర్స్.

ఇకపోతే పులిసిన పండ్లు, జ్యూస్‌లు, పాల నుంచి కూడా విటమిన్–డి లభిస్తుంది. ఆల్మండ్ మిల్క్, సోయా మిల్క్, ఓట్ మిల్క్, ఆరెంజ్ జ్యూస్ వంటివి కూడా విటమిన్–డి పొందడానికి బెస్ట్ ఆప్షన్లు. వీటితోపాటు ఎండ ఉన్నా లేకపోయినా కాసేపు బయట నిల్చోవడం లేదా తిరగడం వంటివి చేస్తే డిఫ్యూజ్డ్ సన్ లైట్ ద్వారా విటమిన్–డి లెవల్స్ కొంతవరకూ పెరిగే అవకాశం ఉంది.

Vitamin D,Monsoon,Rainy Season,Food,Vitamin D Deficiency
Vitamin D, Monsoon, Rainy Season, Health, Health Tips, Telugu News, Telugu Global News, Latest Telugu News, News, News Updates, vitamin D deficiency, Vitamin Deficiency, Telugu News Health News

https://www.teluguglobal.com//health-life-style/rainy-season-is-to-prevent-vitamin-d-deficiency-1055591