2023-02-15 12:17:41.0
https://www.teluguglobal.com/h-upload/2023/02/15/723313-valapu.webp
పలుకా..
చిలుక వై మాట్లాడవా
మనసా..
నెమలి వై నర్తించవా
తన కై ..
నా కోసమై ..
తను నాకు
ప్రాణం కన్న ప్రీతి
ప్రేమతో పిలిచినా
పలకదేలా
నా పలుకు బాగోకనా
కనికరించుమా చిలుకా
తను నాకు
చెలిమి కన్న జాస్తి
ధ్యాసతో దరిచేరినా
నిలువదేలా
నా నడత నచ్చకనా
కరుణించుమా నెమలీ
తను నాదే అన్న
నేను తనకే అన్న
నా తలంపు వెన్న
నా వలపు మిన్న
పలుకా..
చిలుక వై మాట్లాడవా
మనసా..
నెమలి వై నర్తించవా
తన కై .. నా కోసమై ..
– బివిడి ప్రసాదరావు
Valapu Geethika,BVD Prasada Rao,Telugu Kavithalu