వలపు వీచికలు

2023-05-29 09:22:19.0

https://www.teluguglobal.com/h-upload/2023/05/29/772570-valapu.webp

ప్రియతమా

నీ కలలతోనే తెరుచుకుంటాయి

నా తలపుల వాకిళ్ళు

నీ చూపుల సందేశాలు

నీ బుగ్గలు పూయిస్తున్న మందారాలు

చెప్పకనే చెబుతున్నాయి

మౌనం మాట్లాడుతుందని

అందుకే నేను ఏనాడూ

నన్ను ప్రేమించమని అడగలేదు

నిన్ను ప్రేమించటానికి

నీ అనుమతి అక్కర్లేదు

ఎందుకంటే నీ మౌనం

నీ మాట కంటే శక్తిమంతం కనుక

చెలీ !

చూడకనే ఓ ఓరగంటి చూపు

ఇటువిసురుతావు

ఆ చూపుకి ఓ గులాబీని తగిలించు

ఓ తేనె సంతకం పెట్టు

ఓ జీవితకాలం ఖైదీనవుతా

నీ ప్రేమకే తలవంచుతా

నేను నేనుగా మిగలని

నీ వవుతా !

-గిడుగు లక్ష్మీదత్ (న్యూజెర్సీ)

Valapu Vichikalu,Telugu Kavithalu,Gidugu Lakshmi Dutt