2022-06-01 03:33:55.0
సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సప్‌కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లు ఉన్నారు. మన దేశంలో కూడా వాట్సప్‌ను నిత్యం వాడుతూనే ఉంటారు. కేవలం వ్యక్తిగతంగానే కాకుండా ప్రొఫెషనల్‌గా కూడా వాట్సప్ వినియోగం ఎక్కువగా ఉన్నది. దీంతో వాట్సప్ యాజమాన్యం కూడా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొని వస్తున్నది. సహజంగా మనం వాట్సప్‌లో ఏదైనా మెసేజ్ తప్పుగా టైప్ చేస్తే దాన్ని డిలీట్ చేసి మళ్లీ టైప్ చేయడమో లేదంటే స్టార్ గుర్తు (*) పెట్టి తప్పుగా […]
సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సప్‌కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లు ఉన్నారు. మన దేశంలో కూడా వాట్సప్‌ను నిత్యం వాడుతూనే ఉంటారు. కేవలం వ్యక్తిగతంగానే కాకుండా ప్రొఫెషనల్‌గా కూడా వాట్సప్ వినియోగం ఎక్కువగా ఉన్నది. దీంతో వాట్సప్ యాజమాన్యం కూడా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొని వస్తున్నది.
సహజంగా మనం వాట్సప్‌లో ఏదైనా మెసేజ్ తప్పుగా టైప్ చేస్తే దాన్ని డిలీట్ చేసి మళ్లీ టైప్ చేయడమో లేదంటే స్టార్ గుర్తు (*) పెట్టి తప్పుగా రాసిన పదాలను తిరిగి పంపడమో చేస్తుంటాము. కానీ ఇకపై ఇలా కష్టపడాల్సిన అవసరం లేకుండా కొత్తగా ‘ఎడిట్’ ఆప్షన్‌ను వాట్సప్ తీసుకొని వస్తున్నది. ఈ టూల్‌ను ప్రస్తుతం టెస్ట్ చేస్తున్నట్లు ‘వాబీటా ఇన్ఫో’ వెబ్‌సైట్ తెలిపింది.
వాట్సప్‌లో ఏదైనా మెసేజ్ పంపిన తర్వాత దాన్ని సెలెక్ట్ చేస్తే కాపీ, ఫార్వర్డ్ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. అయితే కొత్తగా ఇలా సెలెక్ట్ చేస్తే ఎడిట్ ఆప్షన్ కూడా వస్తుంది. మనం పంపిన మెజేజ్‌లో ఉండే స్పెల్లింగ్ మిస్టేక్స్, ఇతర తప్పులు సరిచేసుకొని మెసేజ్ అప్డేట్ చేయవచ్చు. కాగా, ప్రస్తుతం ఈ ఆప్షన్ టెస్టింగ్‌లో ఉందని.. మెసేజ్ పంపిన ఎంత సమయంలోపు ఎడిట్ చేసుకోవచ్చు అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో మాత్రమే దీన్ని టెస్ట్ చేస్తున్నారు. అయితే ముందుగా ఆండ్రాయిడ్‌లో విడుదల చేసి ఐవోస్, డెస్క్ టాప్ వెర్షన్లకు తర్వాత ఈ ఆప్షన్ ఇస్తారా? లేదా అన్నింటికీ ఒకేసారి ఈ ఆప్షన్ వస్తుందా అనే వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
iOS and desktop versions that were first released on Android,Social messaging app WhatsApp,Watsapp latest features available