వాట్సాప్‌లో.. చాట్ పిన్స్, హ్యాండ్స్ ఫ్రీ కాలింగ్ ఫీచర్లు…

https://www.teluguglobal.com/h-upload/2023/01/25/500x300_720642-whatsapp.webp

2023-02-07 07:16:05.0

తాజాగా చాట్స్‌లో మెసేజ్‌లను పిన్‌ చేసుకునే ఫీచర్‌‌తో పాటు హ్యాండ్స్ ఫ్రీ కాలింగ్ లాంటి కొత్త ఫీచర్లను తీసుకురానున్నట్టు వాట్సాప్ బీటా ఇన్ఫో ప్రకటించింది.

మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ లో ఎప్పటికప్పడు కొత్త ఫీచర్లు వస్తూనే ఉంటాయి. అయితే తాజాగా చాట్స్‌లో మెసేజ్‌లను పిన్‌ చేసుకునే ఫీచర్‌‌తో పాటు హ్యాండ్స్ ఫ్రీ కాలింగ్ లాంటి కొత్త ఫీచర్లను తీసుకురానున్నట్టు వాట్సాప్ బీటా ఇన్ఫో ప్రకటించింది .ఈ ఫీచర్లు ఎలా పనిచేస్తాయంటే..

వాట్సాప్‌ చాట్‌, గ్రూప్‌చాట్స్‌లో యూజర్లు చేసుకునే మెసేజ్‌లలో ముఖ్యమైన వాటిని టాప్‌లో ఉంచుకునేందుకు చాట్ పిన్ అనే ఫీచర్ పనికొస్తుంది . అలాగే వాట్సాప్ కాలింగ్‌ కోసం ఈజీ షార్ట్‌కట్‌ క్రియేట్‌ చేసుకునే ఫీచర్‌ను కూడా తీసుకురానున్నట్టు వాట్సాప్‌ ఇప్పటికే ప్రకటించింది. 

ఇక వీటితో పాటు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లేదా ముఖ్యమైన పనిలో ఉండి మెసేజ్‌కి రిప్లై టైప్ చేయలేనప్పుడు సులువుగా రిప్లై ఇవ్వగలిగేలా హ్యాండ్స్ ఫ్రీ అనే ఫీచర్ రాబోతోంది. 

ఈ ఫీఛర్ సాయంతో చేతులతో టైప్ చేయకుండానే ఈజీగా మెసేజ్‌లు, కాల్స్ చేసుకోవచ్చు. అయితే ఈ ఫీచర్ కోసం ఫోన్‌లో వాయిస్ అసిస్టెంట్‌ను ఆన్‌లో ఉంచుకోవాలి. 

Whatsapp,Whatsapp Update,Whatsapp Users,Whatsapp Features,Telugu News

https://www.teluguglobal.com//science-tech/whatsapp-chat-pins-hands-free-calling-features-892801