https://www.teluguglobal.com/h-upload/2023/07/19/500x300_797078-whatsapp-chat.webp
2023-07-19 08:36:41.0
మొబైల్ నెంబర్‌ను సేవ్ చేయకుండానే అవతలి వ్యక్తికి మెసేజ్ చేసుకునేందుకు ఓ ఆప్షన్ తీసుకొచ్చింది. అలాగే వాట్సాప్ ‘అఫీషియల్ చాట్’ పేరుతో మరో కొత్త ఫీచర్‌ను కూడా తీసుకొచ్చింది.
ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునే వాట్సాప్.. తాజాగా మరో రెండు కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. మొబైల్ నెంబర్‌ను సేవ్ చేయకుండానే అవతలి వ్యక్తికి మెసేజ్ చేసుకునేందుకు ఓ ఆప్షన్ తీసుకొచ్చింది. అలాగే వాట్సాప్ ‘అఫీషియల్ చాట్’ పేరుతో మరో కొత్త ఫీచర్‌ను కూడా తీసుకొచ్చింది. ఇవెలా పనికొస్తాయంటే..
మామూలుగా వాట్సాప్‌లో ఒక నెంబరుకి మెసేజ్ చేయాలంటే.. ఆ నెంబర్‌ను ముందుగా కాంటాక్ట్స్‌లో సేవ్ చేయాల్సి ఉంటుంది. అయితే వాట్సాప్ తీసుకొస్తున్న కొత్త ఫీచర్‌తో ఇకపై ఆ అవసరం ఉండదు.
వాట్సాప్ యాప్‌ను ఓపెన్‌చేసిన తర్వాత ‘స్టార్ట్ న్యూ చాట్’ బటన్‌పై క్లిక్ చేస్తే.. కాంటాక్ట్స్ లిస్ట్, సెర్చ్ బార్ కనిపిస్తాయి. అక్కడ సెర్చ్ బార్‌లో కొత్త మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేస్తే.. ఆ నెంబర్ కాంటాక్ట్ లిస్ట్‌లో లేకపోయినా మెజేస్ చేసేలా కొత్త ఆప్షన్ కనిపిస్తుంది. అయితే ఈ కొత్త ఫీచర్ ప్రస్తుతం బీటా టెస్టింగ్ దశలో ఉంది. వాట్సాప్ బీటా ఇన్ఫో ప్రకారం మరికొన్ని రోజుల్లో వాట్సాప్ అప్‌డేట్ ద్వారా ఈ ఫీచర్ యూజర్లకు అందుబాటులోకి వస్తుంది.
దీంతో పాటుగా వాట్సాప్ తన కస్టమర్ల కోసం మరో కొత్త ప్రైవసీ ఫీచర్‌ను తీసుకురానుంది. ఈ కొత్త ఫీచర్‌కు వాట్సాప్.. ‘అఫీషియల్ చాట్’ అని పేరు పెట్టింది. వాట్సాప్ బీటా ఇన్ఫో ప్రకారం.. యూజర్లు వాట్సాప్‌కు సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్ అన్నీ అఫిషియల్ చాట్ ద్వారా తెలుసుకునే వీలుంటుంది. యూజర్లు అఫిషియల్ చాట్‌లను ఆర్కైవ్ చేయొచ్చు. వద్దనుకుంటే చాట్‌ను బ్లాక్ కూడా చేయొచ్చు.
WhatsApp,Official Chat,Whatsapp Update,whatsapp call,Whatsapp Official Chat
https://www.teluguglobal.com//science-tech/whatsapp-to-bring-official-chat-feature-for-tips-and-tricks-all-details-948821