https://www.teluguglobal.com/h-upload/2023/09/12/500x300_824008-asthma.webp
2023-09-12 12:46:11.0
వర్షాకాలంలో వచ్చే వాతావరణ మార్పుల వల్ల చాలామందిని ఆస్తమా సమస్య వేధిస్తుంటుంది. అంతేకాదు పలు శ్వాసకోశ సమస్యలకు కూడా ఈ సీజన్ కారణమవుతోంది.
వర్షాకాలంలో వచ్చే వాతావరణ మార్పుల వల్ల చాలామందిని ఆస్తమా సమస్య వేధిస్తుంటుంది. అంతేకాదు పలు శ్వాసకోశ సమస్యలకు కూడా ఈ సీజన్ కారణమవుతోంది. మరి ఇలాంటి సందర్భంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..
ఆస్తమా లేదా ఇతర శ్వాసకోశ సమస్యలు ఉన్నవాళ్లకు వర్షాకాలంలో ఆ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. ఊపిరి సరిగా ఆడకపోవడం, జలుబు, దగ్గు, ఉబ్బసం వంటివి వేధిస్తుంటాయి. అందుకే ఈ సీజన్లో ఇలాంటివాళ్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలంటున్నారు డాక్టర్లు.
ముఖ్యంగా ఆస్తమా సమస్య ఉన్నవాళ్లు వాతావరణం చల్లబడినప్పుడు వెంటనే ఆవిరి తీసుకోవడం మొదలుపెట్టాలి. మరిగించిన నీళ్లలో చిటికెడు పసుపును వేసి రోజుకి నాలుగైదు సార్లు ఆవిరి పట్టాలి. అలాగే ఉదయం, రాత్రి వేళల్లో పసుపు, మిరియాలు పొడి కలిపి మరిగించిన పాలు తాగాలి. పడుకునేటప్పుడు చల్లగాలి తగలకుండా దుప్పటి కప్పుకోవాలి. రెగ్యులర్గా మందులు వాడుతున్నవాళ్లు మర్చిపోకుండా మెడిసిన్స్ తీసుకోవాలి.
జలుబు, దగ్గు వేధిస్తున్న వాళ్లు వేడినీళ్లలో ఉప్పు కలుపుకుని పుక్కిలించాలి. మిరియాల పాలు, తేనె, నిమ్మరసంతో చేసిన టీ వంటివి తాగుతుండాలి. తులసి ఆకుల రసాన్ని తేనెతో కలిపి తీసుకున్నా దగ్గు నుంచి రిలీఫ్ ఉంటుంది. వీటితోపాటు శ్వాస సమస్యలున్నవాళ్లు శరీరంలో నీటి శాతం ఉండేలా చూసుకోవాలి.
ఇక ఉబ్బసం, శ్వాసలో ఇబ్బందులు ఉన్నవాళ్లు కొన్ని రకాల పండ్లు, కాయగూరలు డైట్లో చేర్చుకోవాలి. ముఖ్యంగా విటమిన్–సీ ఉండే సిట్రస్ ఫ్రూట్స్, విటమిన్–ఈ, బీటాకెరోటిన్లు,ఫ్లేవనాయిడ్స్ ఉండే పాలకూర, ఆవకాడో, బ్రొకలీ, ఇతర ఆకుకూరల వంటివి తీసుకోవాలి. మెగ్నీషియం, ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ కోసం నట్స్ తీసుకోవాలి. సమస్య ఎక్కువగా వేధిస్తున్న వాళ్లు తప్పక డాక్టర్ను కలవాలి.
Asthma,Monsoon,Health Tips
Asthma, Health tips, Monsoon, Health News, Telugu Global News, Latest Telugu News, Asthma in Rainy Season
https://www.teluguglobal.com//health-life-style/how-to-control-asthma-in-rainy-season-961075