http://www.teluguglobal.com/wp-content/uploads/2016/02/swelling.png
2016-02-12 00:45:25.0
చాలా రకాల వ్యాధుల్లో శరీరం లోపల వాపు ఉంటుంది. దీన్నే ఇన్‌ఫ్లమేషన్ అంటారు. బ్రాంకైటిస్, గొంతునొప్పి, జలుబు, అపెండిస్‌సైటిస్. తీవ్రమైన వ్యాయామంతో వచ్చే వాపులు, చర్మవ్యాధులు, సైనసైటిస్, ఆస్తమా, క్షయ…ఇలా అన్ని తీవ్రమైన అనారోగ్యాల్లోనూ శరీరంలో వాపు ఉంటుంది. శరీరం ఇన్‌ఫెక్షన్‌కి గురయినా లేదా గాయలపాలయినా, ఇంకా ఎలాంటి హాని జరిగినా వాపు ఉంటుంది. కణజాలంలో వాపు తరువాతే ఆ సమస్యలు తగ్గుతాయి. అంటే వాపు ఇలాంటి సమయాల్లో ఒక రక్షణ వ్యవస్థలా పనిచేస్తుంది. కానీ తీవ్రమైన […]
చాలా రకాల వ్యాధుల్లో శరీరం లోపల వాపు ఉంటుంది. దీన్నే ఇన్‌ఫ్లమేషన్ అంటారు. బ్రాంకైటిస్, గొంతునొప్పి, జలుబు, అపెండిస్‌సైటిస్. తీవ్రమైన వ్యాయామంతో వచ్చే వాపులు, చర్మవ్యాధులు, సైనసైటిస్, ఆస్తమా, క్షయ…ఇలా అన్ని తీవ్రమైన అనారోగ్యాల్లోనూ శరీరంలో వాపు ఉంటుంది. శరీరం ఇన్‌ఫెక్షన్‌కి గురయినా లేదా గాయలపాలయినా, ఇంకా ఎలాంటి హాని జరిగినా వాపు ఉంటుంది. కణజాలంలో వాపు తరువాతే ఆ సమస్యలు తగ్గుతాయి. అంటే వాపు ఇలాంటి సమయాల్లో ఒక రక్షణ వ్యవస్థలా పనిచేస్తుంది. కానీ తీవ్రమైన ఇన్‌ఫ్లమేషన్లు హానికరమైన అనారోగ్యాలుగానూ మారతాయి. కొన్ని రకాల క్యాన్సర్లు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటివి అలాగే వస్తాయి. అందుకే ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గించుకోవాలి. అయితే శరీరం కొన్ని పరిస్థితుల్లో మరింతగా ఇన్‌ఫ్లమేషన్‌కి గురవుతుంది. సాధ్యమైనంత వరకు ఆ పరిస్థితులకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
- శరీరం బరువుపెరుగుతుంటే మన శరీరంలోని కొవ్వు కణాల్లో ఇన్‌ఫ్లమేషన్ కి గురయ్యే లక్షణాలు పెరుగుతుంటాయి.
- తీవ్రమైన ఒత్తిడికి గురయినా ఈ వాపు గుణం పెరుగుతుంది. ఒత్తిడి పెరిగిపోయినపుడు వాపుని నియంత్రించే స్ట్రెస్ హార్మోన్ కార్టిసాల్ ఆ శక్తిని కోల్పోతుంది.
- ఒక్కో సిగరెట్ దమ్ము ఊపిరితిత్తుల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతూ వాపు లక్షణాలను పెంచుతుంది.
- మన పొట్టలోని బ్యాక్టీరియా కూడా వాపు పెరిగేందుకు, తగ్గేందుకు కారణం అవుతుంది. ఎలాంటి బ్యాక్టీరియా ఉంటే అలాంటి లక్షణాలు ఉంటాయన్నమాట. మనలో ఎంత రోగనిరోధక శక్తి ఉందనేది కూడా పొట్టలోని 70శాతం బ్యాక్టీరియా నిర్ణయిస్తుంది.
- ఆల్కహాల్ తీసుకున్నా వాపుకి గురయ్యే లక్షణం పెరుగుతుంటుంది.
- మెనోపాజ్‌కి ముందు కుటుంబ నియంత్రణకోసం నోటిద్వారా వేసుకునే మాత్రలను వాడిన మహిళల్లో కూడా వాపు లక్షణాలు పెరిగినట్టుగా గుర్తించారు.
Inflammation,Swelling
https://www.teluguglobal.com//2016/02/12/inflammation/