2024-11-22 11:23:47.0
రాజకీయ విమర్శలు చేసుకోవడానికి ఇది సరైన సమయం కాదని.. అందరూ కలిసి పరిష్కార మార్గాలు కనుక్కోవాలని సూచించిన కాంగ్రెస్ అగ్రనేత
https://www.teluguglobal.com/h-upload/2024/11/22/1380032-rahul.webp
వాయుకాలుష్యం ఉత్తర భారతదేశంలో ఆందోళన కలిగిస్తున్నదని, ఇది జాతీయ అత్యవసర పరిస్థితేనని లోక్‌సభ విపక్షనేత రాహుల్ గాంధీ అన్నారు. రానున్న పార్లమెంటు సమావేశాల్లో దీనిపై కూలంకషంగా చర్చించి పరిష్కారమార్గాలను కనుగొనాలని సహచర ఎంపీలకు పిలుపునిచ్చారు. వాయు కాలుష్య రూపంలో ముప్పు ముంచుకొస్తున్నదని, దాన్ని ఎదురుకోవడానికి సమిష్టిగా స్పందించాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఈ మేరకు ఇండియా గేట్ వద్ద పర్యావరణవేత్త ఝాతో కలిసి మాట్లాడిన వీడియోను రాహుల్ ఎక్స్‌లో పోస్టు చేశారు.
వాయు కాలుష్యానికి సామాన్య ప్రజలే ఎక్కువగా ప్రభావితులవుతున్నారు. చాలామంది చిన్నారులు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఉత్తరభారతంలో నెలకొన్న తాజా పరిస్థితుల వల్ల పర్యాటకం బాగా పడిపోయింది. విషపూరితంగా మారుతున్న వాతావరణాన్నిశుభ్రం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని రాహుల్ పేర్కొన్నారు. కాలుష్య మేఘాలు వందలాది కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్నాయని.. వాటిని తొలిగించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్ని రాహుల్ అన్నారు. దీనికోసం ప్రభుత్వంతో పాటు పలు సంస్థలు, ప్రజలు, నిపుణులు అందరూ కలిసి ముందడుగు వేయాలన్నారు. రాజకీయ విమర్శలు చేసుకోవడానికి ఇది సరైన సమయం కాదన్న ఆయన.. అందరూ కలిసి పరిష్కారమార్గాలు కనుక్కోవాలని సూచించారు. దీనికోసం పార్లమెంటు సమావేశాలను వేదికగా మలుచుకోవాలన్నారు. మరోవైపు శీతాకాల పార్లమెంటు సమావేశాలు నవంబర్ 25న మొదలై డిసెంబర్ 20 వరకు జరగనున్న విషయం విదితమే.
Rahul Gandhi,Sounds major alarm,Over rising pollution in Delhi,Demands Government,Action