2016-07-10 04:06:10.0
గుజరాత్ రాష్ట్రంలోని గిర్ అడవుల్లో ఈ అద్భుతం జరుగుతోంది. 2007లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కోటాతో ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లోకి వచ్చిన మహిళలు ఇప్పుడు ఆసియా ఖండంలోనే క్రూర మృగాల సంరక్షణలో నేరుగా పాల్గొంటున్నఏకైక మహిళా అడవుల రక్షణ దళంగా పేరు తెచ్చుకున్నారు. మొట్టమొదట ఈ ఉద్యోగంలోకి రిక్రూట్ అయిన రాసీలా వాథేర్ ఇప్పుడీ మహిళా బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. 1965లో భారత ప్రభుత్వం గిర్ అడువులను వన్యమృగ సంరక్షణా కేంద్రంగా ప్రకటించింది. తరువాత పదేళ్లకు దీనికి జాతీయ […]
http://www.teluguglobal.com/wp-content/uploads/2016/07/tigers.gif
గుజరాత్ రాష్ట్రంలోని గిర్ అడవుల్లో ఈ అద్భుతం జరుగుతోంది. 2007లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కోటాతో ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లోకి వచ్చిన మహిళలు ఇప్పుడు ఆసియా ఖండంలోనే క్రూర మృగాల సంరక్షణలో నేరుగా పాల్గొంటున్నఏకైక మహిళా అడవుల రక్షణ దళంగా పేరు తెచ్చుకున్నారు. మొట్టమొదట ఈ ఉద్యోగంలోకి రిక్రూట్ అయిన రాసీలా వాథేర్ ఇప్పుడీ మహిళా బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. 1965లో భారత ప్రభుత్వం గిర్ అడువులను వన్యమృగ సంరక్షణా కేంద్రంగా ప్రకటించింది. తరువాత పదేళ్లకు దీనికి జాతీయ పార్కు హోదాని సైతం ఇచ్చారు. ఇక్కడ ఆసియా సింహాలే కాక చిరుతలు, జింకలు, పాములు, హైనాలు, కొండజాతి పిల్లులు, మొసళ్లు తదితర జంతువులు ఉన్నాయి.
రాసీలా వాథేర్ తరువాత ఏటా మహిళలు ట్రైనింగ్ తీసుకుని వన్యమృగ సంరక్షణలోకి వస్తూనే ఉన్నారు. భారతదేశపు సింహాల రాణులుగా పిలువబడుతున్న ఈ బృందం సభ్యులు ఇప్పటివరకు 627 సింహాలను రక్షించి రికార్డు సృష్టించారు. ఇంత పెద్ద మొత్తంలో సింహాలను రక్షించిన అడవుల రక్షణ దళం వీరే. బురదలో కూరుకుపోయిన మొసళ్లను, బావుల్లో పడిపోయిన చిరుతలను రక్షించడం, గాయాలపాలైన సింహాలకు చికిత్స చేయటం, తల్లులు వదిలేసిన జంతువుల పిల్లలను తెచ్చి సంరక్షించడం…ఇలాంటివి వారు అవలీలగా చేస్తున్నారు. ఇంకా వేటగాళ్లను అరెస్టు చేయటం, గ్రామాల్లోకి వెళ్లిపోయిన కొండచిలువలను తిరిగి తేవటం, గ్రామస్తులను ఏడిపించే అల్లరి కోతులను ఆపటం… ఇలాంటివి కూడా చేస్తారు. మొత్తంగా ఏటా సుమారు 600 జంతువులు వీరి నుండి రక్షణ పొందుతున్నాయి. రాసీలా వాథేర్…తనని వివాహం చేసుకోబోయే వ్యక్తి తన డ్యూటీని అంగీకరించకపోతే పెళ్లినే మానేస్తానని చెబుతున్నారు. ఈమె 200 సింహాల రక్షణలో పాలుపంచుకుంది.
ఇందులో కిరణ్ పితియా (25) అనే మహిళ సింహాలను ఆకట్టుకోవటంలో ఆరితేరి పోయారు. ఆమె 19 సింహాలను రక్షించారు. ఆమె గర్భవతిగా ఉన్నపుడు కూడా నెలలు నిండేవరకు బైక్‌మీద అడవుల్లో తిరిగారు. కిరణ్ ఒళ్లు గగుర్పొడిచే ఒక అనుభవాన్ని ఇలా వివరించారు. ఒక సింహం ఇటీవల తల్లయింది. దాని పిల్లలను, దాని కదలికలను చూడాల్సిన బాధ్యత కిరణ్ పై ఉంది. ఒకరోజు అలా వెళ్లినపుడు చీకటి పడిపోయింది. ఆమె వెంటనే వెనుతిరిగింది. కానీ అప్పటికే ఆడసింహం ఆమెను వెంటాడటం మొదలుపెట్టింది.
వెంటనే కిరణ్ కి విషయం అర్థమై బండిని వెనక్కు తిప్పి తాను సంరక్షకురాలిని అని తెలిసేలా శబ్దం చేసింది. దాంతో అది వెనక్కు తిరిగింది. ఆ రోజు తను అలాగా ముందుకు వెళ్లిపోయి ఉంటే ఆ సింహం తనని చంపేసేదని ఆమె తెలిపింది. ఇలాంటి అనుభవాలు వారందరికీ ఉన్నాయి. వీరి ధైర్యాన్ని మెచ్చుకుంటూ డిస్కవరీ ఛానల్ లయన్ క్వీన్స్ ఆఫ్ ఇండియా అనే పేరుతో డాక్యుమెంటరీని నిర్మించింది. ఈ మహిళా గార్డులు అందరూ గ్రామీణ మహిళలే కావటం విశేషం. దీనివలన వారికి ఉపాధి లభించడమే కాకుండా అడవి జంతువులకు ఒక వాత్సల్య పూరిత వాతావరణాన్ని అందించడం…సాధ్యమైంది.