వాలంటీర్ పోస్టులిచ్చింది వైసీపీ వారికే… బహిర్గతం చేసిన హోం మంత్రి

2022-06-28 01:01:46.0

రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టులు, వాలంటీర్ పోస్టులు వైసీపీ వాళ్ళకే ఇచ్చామని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి, వైసీపీ నాయకురాలు తానేటి వనిత తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో వైసీపీ నియోజకవర్గ ప్లీనరీ సమావేశం సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో కార్యకర్తలకు గుర్తింపు లేదని కొందరు కావాలనే ప్రచారం చేస్తున్నారని, అది నిజంకాదని చెప్పిన ఆమె పోస్టులన్నీ మన పార్టీ వాళ్ళకే ఇస్తున్నాం కదా ! ఇంకేం చేయాలి ? అని  ప్రశ్నించారు. వైఎస్ జగన్ ప్రతి […]

రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టులు, వాలంటీర్ పోస్టులు వైసీపీ వాళ్ళకే ఇచ్చామని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి, వైసీపీ నాయకురాలు తానేటి వనిత తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో వైసీపీ నియోజకవర్గ ప్లీనరీ సమావేశం సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

వైసీపీలో కార్యకర్తలకు గుర్తింపు లేదని కొందరు కావాలనే ప్రచారం చేస్తున్నారని, అది నిజంకాదని చెప్పిన ఆమె పోస్టులన్నీ మన పార్టీ వాళ్ళకే ఇస్తున్నాం కదా ! ఇంకేం చేయాలి ? అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యత ఇస్తారని, ఆయనను నమ్ముకున్న వారి కోసం ఆయన నిలబడతారని వనిత తెలిపారు.

తానేటి వనిత మాట్లాడుతుండగానే కొందరు కార్యకర్తలు లేచి బైటికి వెళ్ళిపోయే ప్రయత్నం చేయగా హాల్ తలుపులు మూసేశారు. దాంతో కార్యకర్తలు గొడవకు దిగారు. చివరకు స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు కలగజేసుకోవడంతో తలుపులు తీసి కార్యకర్తలను బైటికి వదిలారు.

 

Andhra Pradesh,Home Minister,taneti vanitha,volunteer posts,YS Jagan,YSRCP