వాళ్లకు థాంక్స్‌ చెప్పిన నయనతార

 

2024-11-21 04:52:03.0

https://www.teluguglobal.com/h-upload/2024/11/21/1379596-nayanatara.webp

వీరంతా తనకు అత్యంత విలువైన క్షణాలను అందించారని పోస్ట్‌

ఇటీవల ‘నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’ అనే డాక్యుమెంటరీతో పలకరించారు. తాజాగా తన 20 ఏళ్ల కెరీర్‌లో తనకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు చెబుతూ పోస్టు పెట్టారు. బాలీవుడ్‌లో షారుక్‌ ఖాన్‌, టాలీవుడ్‌లో చిరంజీవి, రామ్‌చరణ్‌లకు ధన్యవాదాలు చెప్పారు. తన డాక్యుమెంటరీ కోసం వీరిని సంప్రదించినప్పుడు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదన్నారు.

‘నేను పనిచేసిన ప్రతి సినిమాకు నా జీవితంలో ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. సినీ జర్నీలో లెక్కలేనని ఆనందకరమైన క్షణాలను అందించింది. ఇందులో చాలా సినిమాలు నా మనసుకు దగ్గరయ్యాయి. ఆ జ్ఞాపకాలను, సన్నివేశాలను మా డాక్యుమెంటరీలో చేర్చాలని నిర్మాతలను సంప్రదించినప్పుడు వారు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. వీరంతా నాకు అత్యంత విలువైన క్షణాలను అందించారు. వీరందరిపై నాకెంతో గౌరవం ఉన్నది. నా ప్రయాణం ఇలాగే కొనసాగుతుంది’ అంటూ తనకు సహకరించిన వారికి థాంక్స్‌ చెప్పారు. నయనతార పేర్కొన్న వారిలో షారుక్‌ ఖాన్‌, గౌరీఖాన్‌, చిరంజీవి, రామ్‌చరణ్‌లతో పాటు పలువురు తెలుగు, మలయాళ, తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులున్నారు

అలాగే తన డాక్యమెంటరీ విషయంలో నటుడు ధనుష్‌ తీరును తప్పపడుతూ నయనతార ఇటీవల తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ‘నానుమ్‌ రౌడీ దాన్‌’కు సంబంధించిన మూడు సెకన్ల క్లిప్స్‌ డాక్యుమెంటరీ ట్రైలర్‌తో వాడుకున్నందుకు రూ. 10 కోట్లు పరిహారంగా ఆయన డిమాండ్‌ చేశారని ఆమె ఆరోపించారు. ఈ మేరకు లీగల్‌ నోటీసులు పంపించారన్నారు. ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలోనే నయయతార తన డాక్యుమెంటరీకి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పడంతో మరోసారి ఈ అంశం తెర మీదికి వచ్చింది. 

 

Nayanthara,Shah Rukh Khan Chiranjeevi,Ram Charan,Dhanush