2024-09-13 12:55:32.0
హైదరాబాద్ లోని వాహనదారులకు పోలీసులు అలెర్ట్ జారీ చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధింపు.
హైదరాబాద్ లోని వాహనదారులకు పోలీసులు అలెర్ట్ జారీ చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఆంక్షలు దాదాపు 16 రోజులపాటు ఉండనున్నాయి. సైబర్ టవర్స్ ఫ్లైఓవర్ ల్యాండింగ్ నుంచి యశోద హాస్పిటల్ వరకు సర్వీస్ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దాంతో సెప్టెంబర్ 14 నుంచి 30వ తేదీ వరకు ట్రాఫిక్‌ను వివిధ మార్గాల్లో మళ్లించనున్నారు.
ట్రాఫిక్ పోలీసులు సూచనల మేరకు ఐటీ కారిడార్ మీదుగా ప్రయాణించేవారు ఈ ఆంక్షలు దృష్టిలో పెట్టుకోవాలి. సైబర్ టవర్స్, 100 ఫీట్ జంక్షన్, కొత్తగూడ జంక్షన్ నుంచి జేఎన్‌టీయూ, మూసాపేట్ వైపు వెళ్లే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాల్సి ఉంటుంది.
ట్రాఫిక్ ఆంక్షలు- ప్రత్యామ్నాయ మార్గాలు
- టోడీ కాంపౌండ్ నుంచి 100 ఫీట్ జంక్షన్ మీదుగా JNTU, మూసాపేట్ వైపు వచ్చే వాహనాలు.. పర్వత్‌నగర్ జంక్షన్ వద్ద మళ్లింపు తీసుకొని ఖైత్లాపూర్ వంతెన మీదుగా వెళ్లొచ్చు.
- ఐకియా, సైబర్ గేట్‌వే, COD జంక్షన్ నుంచి సైబర్ టవర్స్ ఫ్లైఓవర్ మీదుగా JNTU వైపు వెళ్లే వాహనాలు నేరుగా జేఎన్టీయూ వైపు కొనసాగుతాయి.
- సైబర్ టవర్స్ ఫ్లైఓవర్ కింద JNTU వైపు ప్రయాణించే వాహనాలు N-గ్రాండ్ హోటల్ వద్ద మళ్లి.. N-కన్వెన్షన్ మీదుగా వెళ్లవచ్చు.
- ఇవే కాకుండా వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా భాగ్యనగరంలోని అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.
Traffic restrictions,Hyderabad,Cyberabad Police,vinayaka nimajjan,traffic police