వాహనాల రొదతో గుండెకు చేటు

https://www.teluguglobal.com/h-upload/2024/05/01/500x300_1323752-cardiovascular-diseases.webp
2024-05-01 06:15:32.0

సాధారణంగా గట్టి శబ్దాలు వింటే గుండె దడ పుట్టేస్తోంది అనడం చాలా కామన్. ఏదో మాటవరసకు అనే మాట కాదిది ఇందులో నిజం ఉంది.

సాధారణంగా గట్టి శబ్దాలు వింటే గుండె దడ పుట్టేస్తోంది అనడం చాలా కామన్. ఏదో మాటవరసకు అనే మాట కాదిది ఇందులో నిజం ఉంది. నగరాల్లో పెరిగిపోతున్న వాహనాలతో ట్రాఫిక్ ఇబ్బందులు, వాయు కాలుష్యం పెరుగుతోందని పర్యావరణవేత్తలు ఎప్పుడూ ఆందోళన వ్యక్తం చేసే విషయం తెలిసిందే. ట్రాఫిక్‌లో వాహనాల రొద, హారన్ల మోతతో మనకు చికాకు వస్తుంది. అయితే వచ్చేది చికాకు మాత్రమే కాదు.. హృద్రోగ ముప్పు కూడా అని తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించారు.

వాహనాల నుంచి వెలువడే శబ్దాలు గుండె ఆరోగ్యానికి ఎసరు పెడుతున్నాయని, గుండెపోటు ముప్పు పెంచుతున్నాయని తాజాగా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి 10 డెసిబుల్స్‌ ధ్వని పెరుగుదలతో చాలా మందిలో గుండెపోటు, మధుమేహం తదితర సమస్యలు 3.2 శాతం పెరుగుతున్నాయని తేల్చారు.

దీనితో హృద్రోగాలకు ట్రాఫిక్‌ ధ్వని కూడా ఒక కారణంగా నిర్ణయించాల్సిన అవసరం ఉన్నదని జర్మనీకి చెందిన యూనివర్సిటీ మెడికల్‌ సెంటర్‌ మెయింజ్‌ పరిశోధకులు తెలిపారు. ముఖ్యంగా రాత్రిపూట ట్రాఫిక్ సౌండ్ వలన నిద్ర కోల్పోయి, ఒత్తిడి పెరిగిపోయి, ఫలితంగా రక్తపోటు, వాపు, వాస్కులర్ వ్యాధుల తీవ్రతను పెంచుతుందని, అలాగే డయాబెటీస్ ముప్పు కూడా ఉందని పరిశోధకులు తెలిపారు.

ఈ నేపథ్యంలో, ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని.. వాయు, రైలు, రోడ్డు ట్రాఫిక్‌ల కారణంగా వెలువడే శబ్దకాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని పరిశోధకులు సూచించారు. రోడ్లు నిర్మించే సమయంలోనే ప్రత్యేక తారును వినియోగించటం , అలాగే జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో, రద్దీగా ఉండే రహదారుల వెంట శబ్ద తీవ్రతను తగ్గించే నాయిస్‌ బ్యారియర్స్‌ను ఏర్పాటు చేయాలని, సూచించారు. వీటి ద్వారా తద్వారా 10 డెసిబెల్స్‌ వరకు శబ్ద తీవ్రతను తగ్గించవచ్చని పేర్కొన్నారు.

Traffic,Cardiovascular Diseases,Noise pollution,heart disease,Heart Attacks
Traffic noise, risk of cardiovascular diseases, noise pollution, cardiovascular diseases, heart disease, stroke, diabetes, noise and cardiovascular disease, traffic noise heart attacks, can loud music cause heart problems, can loud music cause heart attack, chronic noise and psychological stress, noise pollution stress

https://www.teluguglobal.com//health-life-style/traffic-noise-can-increase-risk-of-cardiovascular-disease-study-1026032