https://www.teluguglobal.com/h-upload/2023/01/07/500x300_434275-immunity-boosting-juices.webp
2023-01-07 14:31:46.0
Immunity-Boosting Juices For Winter Diet: చలికాలంలో చాలామందికి శ్వాస సమస్యలు, ఊపిరితిత్తుల జబ్బులు ఎక్కువగా వస్తుంటాయి. తరచూ జలుబు, దగ్గు లాంటి ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. అయితే డైట్‌లో కొన్ని జ్యూస్‌లు చేర్చుకోవడం ద్వారా ఇలాంటి సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.
చలికాలంలో చాలామందికి శ్వాస సమస్యలు, ఊపిరితిత్తుల జబ్బులు ఎక్కువగా వస్తుంటాయి. తరచూ జలుబు, దగ్గు లాంటి ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. అయితే డైట్‌లో కొన్ని జ్యూస్‌లు చేర్చుకోవడం ద్వారా ఇలాంటి సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.
ఊపిరితిత్తులు వాటంతట అవే డీటాక్స్ అవ్వగలవు. సాధారణంగా వచ్చే ఇన్ఫెక్షన్లను ఊపిరితిత్తులు ఇమ్యూనిటీ సాయంతో తగ్గించుకుంటాయి. అయితే చలికాలంలో కాలుష్యం, చల్లగాలి కారణంగా ఊపిరితిత్తులు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి. అందుకే వింటర్‌లో లంగ్స్ డీటాక్స్‌కు హెల్ప్ చేసే కొన్ని జ్యూస్‌లు తీసుకోవాలి. అవేంటంటే..
నిమ్మరసం
నిమ్మరసంలో ఉండే విటమిన్–సీ, కాల్షియం, మెగ్నిషియం వల్ల ఇమ్యూనిటీ త్వరగా బూస్ట్ అవుతుంది. లంగ్ ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటుంది. అందుకే వింటర్‌లో రోజూ ఉదయాన్నే గోరువెచ్చటి నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనే కలుపుకుని తాగడం అలవాటు చేసుకోవాలి.
ఆకుకూరల జ్యూస్
ఆకుకూరల్లో ఎక్కువగా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని ఫ్రీరాడికల్స్‌తో పోరాడతాయి. ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ఆకుకూరలు ఎంతో మంచిది. అందుకే వింటర్‌లో ఉదయాన్నే ఏవైనా రెండుమూడు రకాల ఆకుకూరలను కట్ చేసి అందులో కీరదోస, నిమ్మరసం కలిపి జ్యూస్ చేసుకుని తాగాలి.
దానిమ్మ రసం
దానిమ్మలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కణాలు దెబ్బతినకుండా కాపాడుతాయి. ఇమ్యూనిటీని పెంచుతాయి. కాబట్టి రోజూ దానిమ్మరసాన్ని తాగుతుంటే శ్వాస ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు.
పైనాపిల్ జ్యూస్
పైనాపిల్‌లో మాంగనీస్, కాపర్, విటమిన్–బీ6, విటమిన్–సీ పుష్కలంగా ఉంటాయి. అలాగే ఐరన్, కాల్షియం, జింక్, విటమిన్–కె లభిస్తాయి. వింటర్‌లో ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల మెరుగైన జీవక్రియ, గుండె ఆరోగ్యం, వాపులు, కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి రక్షణ పొందొచ్చు. అంతేకాదు పైనాపిల్ ఊపిరితిత్తులను శుభ్రం చేయడంతోపాటు ఆస్తమా లక్షణాలను కూడా తగ్గించగలదు.
టమాట రసం
టమాటలో ఉండే బీటా కెరోటిన్, లైకోపీన్‌ల వంటి యాంటీ ఆక్సిడెంట్ల వల్ల కొలెస్ట్రాల్, బీపీ , ఒబెసిటీ లాంటివి తగ్గుముఖం పడతాయి. రోజూ టమాట జ్యూస్ తాగడం వల్ల గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మంచిది.
Winter Diet,winter,Juices,Immunity Boosting
immunity boosting diet, immunity boosting drinks, immunity juice, winter immunity diet, immunity boosting juice, winter drinks, winter drinks for immunity, నిమ్మరసం, ఆకుకూరల జ్యూస్, దానిమ్మ రసం, టమాట రసం
https://www.teluguglobal.com//health-life-style/5-immunity-boosting-juices-for-winter-diet-554631