2025-02-04 15:09:21.0
కరీంమ్‌నగర్ శాతవాహన విశ్వవిద్యాలయంలో “వికసిత్ భారత్ 2047″ ఇండియా విజన్ ఫర్ డెవలప్మెంట్” అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహించారు.
కరీంమ్‌నగర్‌లోని శాతవాహన యూనివర్సిటీలో అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో వికసిత్ భారత్ @2047 ఇండియా విజన్ ఫర్ డెవలప్మెంట్” అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్. వి. బాలకిష్ణారెడ్డి శాతవాహన ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్ సంయుక్తంగా సదస్సు సావనీర్ ఆవిష్కరించారు. అనంతరం ఉన్నత విద్యా మండలి చైర్మన్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్రాల మధ్య సమగ్ర సహకారము మరియు సుస్థిరమైన అభివృద్ధే వికసిత్ భారతి యొక్క లక్ష్యం అన్నారు. యూనివర్సీటీ వీసీ ఉమేష్ కుమార్ మాట్లాడుతూ ఇప్పటివరకు భారత దేశము కొన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఇంకా అనేక రంగాలలో అభివృద్ధి చెందవలసిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. ఈ బృహత్తర కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
మరొక విశిష్ట అతిథి మరియు కాకతీయ విశ్వవిద్యాలయ పూర్వ ఉపకులపతి ప్రొఫెసర్. ఆర్ .సాయన్న మాట్లాడుతూ ఇంకా భారతదేశం పరిమాణాత్మకంగా మరియు గుణాత్మకంగా అభివృద్ధి సాధించాలని తెలిపారు. భారతదేశం పారిశ్రామిక మరియు సేవా రంగాలలో త్వరితగతిన వృద్ధి సాధించినప్పటికీ ఇంకా వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు కావాలని అప్పుడే గ్రామీణ భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్.ఎ.జానయ్య గణాంకాలతో విశ్లేషించారు. కాకతీయ విశ్వవిద్యాలయ అర్థశాస్త్ర విభాగపు సీనియర్ ఆచార్యులు మరియు విశ్వవిద్యాలయ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్.బి. సురేష్ లాల్ మాట్లాడుతూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో భారత ఆర్థిక వ్యవస్థ పోటీ పడుతుందని ఇది 2047 వరకు అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
Higher Education Chairman Balakishna Reddy,VC Umesh Kumar,Prof. A. Janaiah,Satavahana University,CM Revanth Reddy,KCR,KTR,BRS Party