వికీపీడియాకు కేంద్రం నోటీసులు

2024-11-05 07:53:38.0

కచ్చితత్వం లేని సమాచారం ఉందన్న ఫిర్యాదుల మేరకు నోటీసులిచ్చిన కేంద్రం

https://www.teluguglobal.com/h-upload/2024/11/05/1374927-wikipedia.webp

వికీపీడియాకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. కచ్చితత్వం లేని సమాచారం ఉందన్న ఫిర్యాదుల మేరకు నోటీసులు ఇచ్చింది. వికీపీడియాలో పక్షపాతంగా సమాచారం ఉంటుందని పలువురి నుంచి ఫిర్యాదులు అందాయి. వీటిపై కేంద్రం తాజా చర్యలు చేపట్టింది. చిన్నసంస్థలకు కూడా ఎడిటోరియల్‌ నియంత్రణ ఉంటుందని.. వికీపీడియాలో ఆ వ్యవస్థ ఎందుకు లేదని ప్రశ్నించింది. ఈ సంస్థ మధ్యవర్తిగా కాకుండా పబ్లిషర్‌గా ఎందుకు పరిగణించకూడదని అడిగింది. 

Wikipedia,Gets Notice,Centre government,Complaints,Bias And Inaccuracies