2024-09-21 03:40:44.0
పర్యావరణ శాఖ అనుమతులు లేకుండా నేహారెడ్డి నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించిన అధికారులు తాజాగా మరోసారి కూల్చివేతలు చేపట్టారు.
https://www.teluguglobal.com/h-upload/2024/09/21/1361387-demolish-bheemili.webp
విశాఖ జిల్లా భీమిలిలో ఆక్రమిత స్థలంలో కాంక్రీట్ నిర్మాణాలను జీవీఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. వైసీపీ నేత విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి ఆక్రమిత స్థలంలో మరోసారి కూల్చివేతలు చేపట్టారు. సీఆర్‌జడ్ నిబంధనల ఉల్లంఘనలు చేపట్టడంతో ఈ చర్యలు చేపట్టారు.
సర్వే నంబర్ 1516, 1517, 1519,1523లో ఉన్న స్థలంలో ఈ కాంక్రీట్ నిర్మాణాలున్నాయి. దాదాపు నాలుగు ఎకరాల స్థలంలో ఈ అక్రమ కట్టడాలు ఉన్నట్లు ఆరోపణలున్నాయి. దీనిపై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ హైకోర్టులో పిల్ వేసిన సంగతి తెలిసిందే. కొత్త ఉత్తర్వులతో రెండు వారాల కిందటే అధికారులు నిర్మాణాల తొలిగింపు చేపట్టారు పర్యావరణ శాఖ అనుమతులు లేకుండా నేహారెడ్డి నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించారు. తాజాగా మరోసారి కూల్చివేతలు చేపట్టారు.