2023-08-15 03:56:42.0
https://www.teluguglobal.com/h-upload/2023/08/15/810473-independence-day-2023.webp
ఎత్త వోయి ఎత్తు
మన విజయ పతాక.
నింగి దాటి అటు వైపు
నాకము దాక
ఎత్త వోయి ఎత్తు
అమరులైనట్టి ఆనాటి
సమరయోధులు
అచ్చెరవు నొందుచు
ముచ్చట పడగ
ఎత్త వోయి ఎత్తు
శతృువుల గుండెల్లో
ఘన శూలములు కాగా
మిత్ర పక్షముల
శాంతి వీవనలాగా
ఎత్త వోయి ఎత్తు
గత మంతా గడచి గడచి
గమ్యము చేరా
మత భేదము లన్ని మరచి
సమ్మతమును కోరా
ఎత్త వోయి ఎత్తు
ప్రతి యిల్లు సుఖ శాంతుల
నిలయము కాగా
ప్రతి గుండె
మువ్వన్నెల జెండాయే కాగా
ఎత్త వోయి ఎత్తు
-బి. శ్రీ రామ్ రెడ్డి.
B Shri Ram Reddy,Telugu Kavithalu,Independence Day 2023,independence day