2025-01-30 05:01:30.0
విద్యార్థులు ఇచ్చిన మొబైల్ ఫోన్ నంబర్లకు లింక్‌ను క్లిక్ చేస్తే హాల్‌టికెట్ వస్తుందన్న అధికారి
తెలంగాణలో విద్యార్థుల ఫోన్లకే ఈ ఏడాది ఇంటర్మీడియట్ హాల్‌టికెట్లు రానున్నాయి. గతంలో కేవలం కళాశాలలకే పంపేవారు. వెబ్‌సైట్‌లో పెట్టి డౌన్‌లోడ్ చేసుకోమనేవారు. కానీ ఈసారి ఇంటర్‌బోర్డు అధికారులు విద్యార్థులు ఇచ్చిన మొబైల్ ఫోన్ నంబర్లకు లింక్ పంపిస్తున్నారు. దాన్ని క్లిక్ చేస్తే హాల్‌టికెట్ వస్తుందని, డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారి ఒకరు తెలిపారు. గురువారం నుంచి ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇంటర్నల్ పరీక్షలు ఉన్నందున ఇప్పటికే పంపించామని, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఫిబ్రవరి 3 నుంచి ప్రాక్టికల్స్ ఉన్నందున త్వరలో పంపిస్తామని తెలిపారు.
TG Inter Hall Tickets,Student phones only,Intermediate education board,Inter Fist Year,Second Year,Hall tickets Download