2024-12-11 06:54:45.0
తదుపరి విచారణ సంక్రాంతి సెలవుల తర్వాతకు వాయిదా
https://www.teluguglobal.com/h-upload/2024/12/11/1384935-ap-high-court.webp
అదానీతో జరిగిన విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి దాఖలైన పిల్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను ఉన్నతన్యాయస్థానం సంక్రాంతి సెలవుల తర్వాతకు వాయిదా వేసింది. విద్యుత్ ఒప్పందాల వల్ల రాష్ట్ర ఆదాయానికి నష్టమని పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. అదానీ, సెకీతో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై విచారణ చేయాలని గతంలో పిల్ దాఖలైన సంగతి తెలిసిందే. దీన్ని మంత్రి పయ్యావుల కేశవ్, సీపీఐ నేత రామకృష్ణ దాఖలు చేశారు.