https://www.teluguglobal.com/h-upload/2024/02/07/500x300_1295693-hearing.webp
2024-02-09 07:41:07.0
సౌండ్ పొల్యూషన్, ఇయర్ ఫోన్స్ వాడకం వంటివి ఎక్కువ అవ్వడం వలన ఈ రోజుల్లో తక్కువ వయసులోనే వినికిడి సమస్యలు వస్తున్నాయని డాక్టర్లు చెప్తున్నారు.
సౌండ్ పొల్యూషన్, ఇయర్ ఫోన్స్ వాడకం వంటివి ఎక్కువ అవ్వడం వలన ఈ రోజుల్లో తక్కువ వయసులోనే వినికిడి సమస్యలు వస్తున్నాయని డాక్టర్లు చెప్తున్నారు. అతి సున్నితమైన చెవిని కాపాడుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చెవి ఆరోగ్యం పాడవ్వడం కారణంగా వినికిడి లోపం సమస్య తలెత్తుతుంది. ఈ తరహా సమస్యలకు చికిత్స చేయడం కష్టం. కొన్ని సందర్భాల్లో వినికిడి పూర్తిగా కోల్పోవచ్చు కూడా. అందుకే చెవులను జాగ్రత్తగా కాపాడుకోవడం ఎంతైనా అవసరం.
కారణాలివే..
వినికిడి సమస్యలు రావడానికి ముఖ్య కారణం పెద్ద పెద్ద సౌండ్స్ వినడం. ముఖ్యంగా ఎక్కువసేపు హెడ్ ఫోన్స్ పెట్టుకోవడం, ట్రాఫిక్‌లో ఎక్కువ సమయం గడపాల్సి రావడం, డీజేలు వినడం వంటి వాటి వల్ల చెవికి వినికిడి సామర్థ్యం తగ్గిపోతుంది. అలాగే చెవులను సరిగా శుభ్రం చేసుకోకపోవడం వల్ల కూడా చెవి ఆరోగ్యం దెబ్బతింటుంది.
జాగ్రత్తలు ఇలా..
చెవి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే పెద్ద పెద్ద శబ్దాలను వినడం తగ్గించాలి. థియేటర్, మ్యూజిక్ కాన్సెర్ట్స్ వంటి వాటికి వెళ్లేటప్పుడు చెవుల్లో మెత్తటి దూదిని పెట్టుకోవచ్చు.
బయట తిరిగేటప్పుడు లేదా క్రాకర్స్ వంటివి పేల్చేటప్పుడు కూడా చెవుల్లో ఇయర్ ప్లగ్స్ లేదా మఫ్స్ వంటివి పెట్టుకోవచ్చు.
వినికిడి సమస్యలను నివారించేందుకు ఇయర్ ఫోన్స్ వాడకాన్ని తగ్గించాలి. ఇంట్లో కూడా తక్కువ వాల్యూమ్‌తో టీవీ చూడాలి.
చెవుల్లో ఉండే క్రిములను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం కూడా ముఖ్యమే. దీనికోసం కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనెను వేడి చేసి చల్లారాక కొద్దిగా చెవిలో వేసుకుని ఒక పక్కగా పడుకోవాలి. ఒక నిముషం తర్వాత తలను వంచేయాలి. లేదా మూడు నాలుగు నెలలకోసారి క్లినిక్‌లో చెవులను క్లీన్ చేయించుకోవచ్చు.
స్మోకింగ్, పొల్యూషన్‌కు ఎక్స్‌పోజ్ అవ్వడం వంటివి కూడా చెవి ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయి. కాబట్టి స్మోకింగ్ మానేయాలి. పొల్యూషన్‌లో మాస్క్ లేదా మఫ్స్ వంటివి వాడాలి. అలాగే చెవుల్లో కాటన్ బడ్స్ పెట్టి తిప్పుకునే అలవాటు మానుకోవాలి.
విటమిన్–బీ9(ఫోలేట్), విటమిన్–డి ఉండే ఆహారాలు తీసుకోవడం ద్వారా చెవి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒత్తిడి లేకుండా చూసుకోవాలి.
sound pollution,Earphones,Hearing Problems,Health Tips
Sound Pollution, earphones, Hearing Problems, Health, Health tips, Telugu Health Tips, News, Telugu News in Health
https://www.teluguglobal.com//health-life-style/how-to-avoid-hearing-problems-998967