2025-01-12 09:20:18.0
మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు ఆత్మకథ ‘ఉనిక’ పుస్తకాన్ని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు.
మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ బయోగ్రఫీ ‘ఉనిక’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్రమంత్రి బండి సంజయ్, గవర్నర్లు బండారు దత్తాత్రేయ, హరిబాబు, మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ లక్ష్మణ్ తదితరులతో కలిసి సీఎం పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం విద్యాసాగర్‌రావు అందించిన సేవలను వక్తలు కొనియాడారు. విద్యాసాగర్‌రావు అనుభవం తెలంగాణ రాష్ట్రాన్నికి చాలా అవసరమని ముఖ్యమంత్రి అన్నారు. తమిళనాడు, మహారాష్ట్ర లాంటి పెద్ద రాష్ట్రాలకు ఒకేసారి గవర్నర్ గా బాధ్యతలు నిర్వహించారంటే ఆయన సామర్థ్యం ఏంటో ప్రధాని మోడీ కూడా గుర్తించారని పేర్కొన్నారు. గతంలో ప్రతిపక్షం.. పాలక పక్షం కలిసి పని చేసేది అని గుర్తు చేశారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తాము ప్రతిపక్ష సభ్యులను సభ నుంచి బహిష్కరించలేదని.. 13 నెలల కాలంలోనే ఇదే చేస్తున్నామని తెలిపారు. విద్యాసాగర్ రావు మొదలు పెట్టిన గోదావరి జలాల వినియోగం ఆలోచన సంపూర్ణంగా పూర్తి కాలేదని సీఎం రేవంత్ అన్నారు. విపక్ష నేతలు అయినా.. అవసరం ఉన్నచోట వారి అనుభవాన్ని వినియోగించుకుంటాం. తెలంగాణ ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని కృషి చేస్తున్నాం. మెట్రో, రీజనల్ రింగ్‌రోడ్డు విషయంలో కేంద్రం సహకరించాలని ప్రధాని మోదీని కోరాను. కేంద్రం సహకరిస్తేనే.. రాష్ట్రాల అభివృద్ధి పరిపూర్ణమవుతుందని సీఎం వెల్లడించారు
CM Revanth reddy,Union Minister Bandi Sanjay,Minister Sridhar Babu,MP Laxman,Prime Minister Modi,Vidyasagar Biography,Regional Ring Road,Governors Bandaru Dattatreya,Haribabu