https://www.teluguglobal.com/h-upload/2025/01/30/1398727-plane-and-helecopter.webp
2025-01-30 05:29:26.0
పోటోమాక్ నదిలో కూలిపోయాయిన విమానం.. సైనిక హెలికాప్టర్
అమెరికాలోని వాషింగ్టన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 18కి చేరింది. రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ అవుతుండగా పీఎస్‌ఏ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ప్రయాణికుల విమానం.. సైనిక హెలికాప్టర్ పరస్పరం ఢీకొన్నాయి. దీంతో ఆ రెండూ పక్కనే ఉన్న పోటోమాక్ నదిలో కూలిపోయాయి. ఘటనాస్థలంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు..
ప్రమాదం కారణంగా విమానం ముక్కలై నదిలో పడిపోయింది. హెలిక్టాపర్ కూడా తలకిందులుగా కూలింది. ఘటన సమయంలో విమానంలో 64 మంది, హెలికాప్టర్‌లో ముగ్గురు సైనికులు ఉన్నారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లు, డ్రైవర్ల సాయంతో నదిలో గాలిస్తున్నారు. ఇప్పటివరకు 18 మంది మృతదేహాలను వెలికి తీసినట్లు సమాచారం.
స్పందించిన ట్రంప్
ప్రమాదంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నట్లు తెలిపారు. సహాయక చర్యలు వేగవంతం చేశామన్నారు. ఘటన జరిగిన గగనతలం ప్రపంచంలోనే అత్యంత నియంత్రణలో, నిరంతరం పర్యవేక్షణలో ఉండే ప్రాంతం. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్, క్యాపిటల్‌కు దక్షిణాక కేవలం మూడు మైళ్ల దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నది.
Passenger jet with 64,Aboard,Crashes,Collision,with military chopper,Near Washington