2023-01-11 06:20:49.0
https://www.teluguglobal.com/h-upload/2023/01/11/434797-viraha-geetham.webp
నీ ఆలోచన లేని
క్షణం ఉండదే
అనుక్షణం తలపుల్లో
ఉన్నది నీవేగా
ప్రేమ విరహంలో
మది అగ్ని గుండం అంటారే
గంధపు కొలనులా
పరిమళభరితమే
ఎప్పుడూ నాకైతే
ఎటువైపు చూపు తిప్పినా
నువ్వే
కనుల లోగిలిలో ఒయ్యారంగా నిలుస్తూ
చిలిపి సైగలతో
ముద్దు మురిపాలను
ఒలికిస్తూనే
మరి ఒంటరినని
ఎలా ఒప్పుకోను?
జతగానే ఉంటాంగా
మనమెప్పుడూ
ఈ జ్ఞాపకాల చిత్తడిలో తడిసిపోతూనే
నువ్వు వచ్చేవరకు ఇలా గడిపేస్తానంటే నన్ను
పిచ్చివాడు అంటారేం?
– యలమర్తి అనురాధ
Yalamarthi Anuradha,Viraha Geetham,Telugu Kavithalu