2024-11-04 09:16:54.0
Ambati Rambabu in controversy.. Tirumala devotees are angry
https://www.teluguglobal.com/h-upload/2024/11/04/1374654-rambabu.webp
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు వివాదంలో చిక్కుకున్నారు. తిరుమల శ్రీవారిని ఇవాళ ఉదయం అంబటి రాంబాబు దర్శించుకున్నారు. ఈ సందర్బంగా అంబటి అధినేత జగన్ బొమ్మతో ఉన్న స్టిక్కర్ అతికించిన చొక్కాను వేసుకుని దర్శనానికి వెళ్లారు. ఇది కాస్త దూమరం రేపింది. సాధారణంగా తిరుమలలో రాజకీయ పార్టీల జెండాలు, బొమ్మలతో రావడం నిషిద్ధం. కానీ ఈ నిబంధనను పట్టించుకోకుండా మాజీ మంత్రి. జగన్ ఫొటోతో ఉన్న స్టిక్కర్ అతికించిన షర్ట్‌ను ధరించి దర్శనానికి వచ్చారు.
దీనిపై భక్తులు మండిపడుతున్నారు. టీటీడీ సంప్రదాయాలను పట్టించుకోకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా జగన్ బొమ్మతో పాటు వైసీపీ గుర్తు ఉన్న బ్యాడ్జితోనే ఆలయంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నప్పటికీ భద్రతా సిబ్బంది పట్టించుకోలేదు. దీనిపై కూడా పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.