వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీకి హైకోర్టులో నిరాశ

 

2024-11-18 07:32:04.0

https://www.teluguglobal.com/h-upload/2024/11/18/1378744-rgv.webp

టాలీవుడ్‌ వివాదస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మకు హైకోర్టులో చుక్కెదురైంది.

సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మకు హైకోర్టులో చుక్కెదురైంది. అతనిపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని హైకోర్టులో ఆయన తరపు న్యాయవాది పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని వివాదస్పద దర్శకుడు ఆర్జీవీ తరపు న్యాయవాది చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. అరెస్ట్‌పై ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని సూచించారు.

పోలీసుల విచారణకు సమయం ఇచ్చేలా ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమో షన్ సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, జన సేన అధినేత పవన్ కల్యాణ్ వ్యక్తిత్వాలను కించపరి చేలా పోస్టులు పెట్టిన రాంగోపాల్ వర్మపై కేసు నమోదు అయింది. ఈ తరుణంలోనే.. అభ్యంతరకర పోస్ట్ లు వర్మ పెట్టారని టీడీపీ మద్దిపాడు మండల ప్రధాన కార్యదర్శి ముత్తనపల్లి రామలింగం కేసు పెట్టారు.

 

Director RGV,AP High Court,Prakasam District,Maddipadu police,Pawan Kalyan,Chandrababu