https://www.teluguglobal.com/h-upload/2024/11/19/1379053-avinash-reddy.webp
2024-11-19 08:07:23.0
ఈ కేసులో శివశంకర్‌రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డికి కూడా నోటీసులు జారీ
వైఎస్ వివేకా హత్య కేసులో వైసీపీ నేత అవినాశ్‌రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో శివశంకర్‌రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డికి నోటీసులు ఇచ్చింది. అవినాశ్ బెయిల్ రద్దు చేయాలని సునీత వేసిన పిటిషన్‌పై సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. అప్రూవర్‌ను శివశంకర్‌రెడ్డి కుమారుడు బెదిరించాడని సునీత న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోర్టుకు తెలిపారు.
మరోవైపు తమపై నమోదు చేసిన కేసులను క్వాష్ చేయాలని సునీత, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డి, సీబీఐ ఎస్పీ రాంసింగ్ దాఖలు చేసినా పిటిషన్‌పైనా విచారణ జరిగింది. వివేకా హత్య కేసు పరిణామాలను లూథ్రా కోర్టుకు వివరించారు. ప్రతివాదులకు సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సునీత, రాజశేఖర్‌రెడ్డి, రాంసింగ్ సుప్రీంను ఆశ్రయించారు.
Viveka Murder Case,YS Avinash Reddy,Supreme Court,Justices Sanjiv Khanna and Dipankar Datta