విష్ణుం వందే …!

2023-11-07 07:23:34.0

https://www.teluguglobal.com/h-upload/2023/11/07/852368-vishnu.webp

కేశవ

మాధవ

గోగోపరక్షక గజరాజరక్షక

గోవర్ధనధరుడవైన ప్రత్యక్షదేవా వాసుదేవ !

వజ్రకవచధర

గోవర్ధనగిరిధర

ఆపద్బాంధవుడైన జగద్రక్షక !

శంఖచక్రధర మురళీధర !

ముకుంద

నిత్యానంద

దుష్టసంహారం చేసిన శిష్టపరిపాలక పాండవపక్ష గోవింద !

భాగవతప్రియ

వేణుగానప్రియ

లక్ష్మీవల్లభ లక్ష్మణాగ్రజ సీతానాయక తులసివనమాల పద్మావతిప్రియ!

ప్రసన్నమూర్తి

జనార్ధన మూర్తి

దీనులను రక్షించి దుష్టులను సంహరించిన అవతారమూర్తి !

నందనందన

రఘుకులనందన

కంసుని సంహరించుటకై అవతరించిన గోపాలుడవే గోకులనందన!

రాముడు

శ్యాముడు

దీనులను కాపాడిన అవతార పురుషుడే దేవుడు 

-జ్యోతి మువ్వల

(బెంగుళూరు)

Jyoti Muvla,Vishnum Vande